Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారాంతాల్లో మరీ ఎక్కువగా నిద్రపోతున్నారా? గుండెపోటు ప్రమాదం ఎక్కువట

వారంలో మిగతా రోజులకంటే వారాంతంలో ఎక్కువగా నిద్రపోతున్నారా.. అయితే మీకు గుండె పోటు వచ్చే అవకాశం పెరిగే ప్రమాదం ఉందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్థితిని వారు సోషల్ జెట్ లాగ్ అని పిలుస్తున్నారు. ఇది గుండెపోటు పెరుగుదలతో ముడిపడి ఉంటుందట.

వారాంతాల్లో మరీ ఎక్కువగా నిద్రపోతున్నారా? గుండెపోటు ప్రమాదం ఎక్కువట
హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (09:18 IST)
వారంలో మిగతా రోజులకంటే వారాంతంలో ఎక్కువగా నిద్రపోతున్నారా.. అయితే మీకు గుండె పోటు వచ్చే అవకాశం పెరిగే ప్రమాదం ఉందని వైద్య పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి స్థితిని వారు సోషల్ జెట్ లాగ్ అని పిలుస్తున్నారు. ఇది గుండెపోటు పెరుగుదలతో ముడిపడి ఉంటుందట. ఈ సోషల్ జెట్ లాగ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే వారాంతంలో త్వరగా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచే సందర్భంలో ఇది ఏర్పడుతుంది. ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశం 11 శాతం పెరుగుతుందట. ఈ సోషల్ జెట్ లాగ్ అనేది ఆరోగ్య క్షీణత, మానసిక స్థితి దిగజారిపోవడం, నిద్రలేమి వంటి లక్షణాలకు కారణమవుతుందని వైద్య పరిశోధకులు చెప్పారు. 
 
దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే... క్రమం తప్పకుండా నిద్రపోవడం అనేది మన ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుందని అరిజోనా యూనివర్సిటీ రీసెర్చ్ అసిస్టెంట్ సియెర్రా బి పోర్బష్ చెప్పారు. గుండెపోటుతోపాటుగా ఇతర ఆరోగ్య సమస్యలను క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం అనేది నివారిస్తుందన్నారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ రెకమెండేషన్ల ప్రకారం పెద్ద వారు ప్రతి రాత్రీ 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోయినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారని చెప్పారు.
 
ఈ పరిశోధనకు గానూ 22 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసున్న 984 మందిని తీసుకున్నారు. పనిదినాలనుంచి వారాంతపు దినాల వరకు వారు నిద్రపోతున్న క్రమాన్ని ప్రశ్నావళి రూపంలో అందించి సమాచారాన్ని రాబట్టారు. ఈ సర్వే వివరాలను స్లీప్ అనే జర్నల్‌లో ఇటీవలే ప్రచురించారు. నిద్రపోయే సమయం, నిద్రలేమి, గుండెపోటు, స్పృహ తప్పడం వంటి అంశాలతో సర్వేని నిర్వహించారు.
 
ఈ పరిశోధనలన్నింటినీ చూస్తుంటే రోజుకు కనీసం ఏడు గంటలైనా మనుషులు నిద్రపోవాలి అంటూ మన పూర్వీకులు చెబుతూ వచ్చిన మాటలను మనం ఎప్పుడో మరిచిపోయామని లేదా పని పేరుతో, ఇతర పేర్లతో వదిలేశామని అర్థమవుతూనే ఉంది. మన పూర్వీకులు చెప్పిన మరో మాట కూడా ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది. అదేమిటంటే.. మన ఖర్మకు మనమే బాధ్యులం..
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విపరీతంగా బాధపెట్టే ఆస్త్మా(ఆయాసం)... ఈ చిట్కాలతో కట్...