Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మగాళ్లలో ఆ లోపం కారణంగా మానవాళి అంతరించిపోతుందా? ఆందోళన...

పురుషుల్లో తలెత్తిన ఆ సమస్య కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం వుందంటూ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటయా అంటే... ఇటీవల పరిశోధకులు సుమారు 200 మంది పురుషులపై చేసిన పరిశోధనల్లో ఆందోళనకరమైన విషయం వెలుగుచూసిందట.

Advertiesment
మగాళ్లలో ఆ లోపం కారణంగా మానవాళి అంతరించిపోతుందా? ఆందోళన...
, గురువారం, 27 జులై 2017 (16:07 IST)
పురుషుల్లో తలెత్తిన ఆ సమస్య కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం వుందంటూ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటయా అంటే... ఇటీవల పరిశోధకులు సుమారు 200 మంది పురుషులపై చేసిన పరిశోధనల్లో ఆందోళనకరమైన విషయం వెలుగుచూసిందట. 
 
వారిలో శుక్ర కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి వున్నట్లు గమనించారు. వీర్య కణాల సంఖ్య గత 40 ఏళ్లతో పోల్చి చూసినప్పుడు దాదాపు సగానికి పైగా పడిపోయినట్లు గుర్తించారు. 1973 నుంచి 2011 మధ్యకాలంలో సుమారు 185 అధ్యయనాలు చేయగా ఫలితాలన్నీ ఆందోళన రేకెత్తించేవిగా వున్నట్లు తెలిపారు. 
 
పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ లెవిన్ మాట్లాడుతూ... శుక్ర కణాల సంఖ్య రేటు ఇలా తరిగిపోతూ వుంటే మాత్రం భవిష్యత్తులో మానవాళి అంతరించిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ సమస్య తీవ్రత అధికంగా వున్నట్లు కనుగొన్నారు. 
 
పురుషుల్లో ఈ సమస్యకు కారణాలేమిటి?
పొగత్రాగడం, అధికబరువు... ఈ రెండూ ప్రధాన కారణాలుగా గుర్తించారు. అంతేకాకుండా రసాయనాలు, పురుగు మందులు, ప్లాస్టిక్ పదార్థాల వాడకం, స్థూలకాయం, ఒత్తిడి, ఆహార పదార్థాల్లో మార్పు, అధికంగా టీవీ లేదా కంప్యూటర్ చూడటం వంటివన్నీ పురుషుల్లో శుక్ర కణాల స్థాయిని హరించి వేస్తున్నాయని కనుగొన్నారు. 
 
అందువల్లనే ఇటీవలి కాలంలో ఐటీ సంబంధిత వృత్తుల్లో కొనసాగేవారు వారి జీవనశైలిని మార్చుకోని కారణంగా వివాహమైన తర్వాత సంతానలేమితో బాధపడుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలన్నిటినీ మానవుడు అధిగమించి పయనించినప్పుడు అతడి మనుగడ సాధ్యమనీ, లేదంటే మానవ జాతి కనుమరుగయ్యే దారుణ స్థితి దాపురించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ పరిశోధకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి.. మాగిన అరటి పండును?