Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షాకింగ్... భారతదేశ పురుషులకు ఏమవుతుంది...?

అన్నీ ఆసుపత్రులు కిటకిట. ఎందుకో తెలుసా.. సంతానం కోసం. సంతాన సాఫల్యత కోసం కొత్త దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరగడం ఇటీవల ఎక్కువయిపోయింది. ఎందుకంటే భారతదేశ పురుషులకు ఓ పెద్ద సమస్యే వచ్చిపడింది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన పరిశోధనలలో భారతదేశ పురుషుల గుండె కలుక

షాకింగ్... భారతదేశ పురుషులకు ఏమవుతుంది...?
, శుక్రవారం, 9 జూన్ 2017 (16:50 IST)
అన్నీ ఆసుపత్రులు కిటకిట. ఎందుకో తెలుసా.. సంతానం కోసం. సంతాన సాఫల్యత కోసం కొత్త దంపతులు ఆసుపత్రుల చుట్టూ తిరగడం ఇటీవల ఎక్కువయిపోయింది. ఎందుకంటే భారతదేశ పురుషులకు ఓ పెద్ద సమస్యే వచ్చిపడింది. ప్రపంచవ్యాప్తంగా జరిపిన పరిశోధనలలో భారతదేశ పురుషుల గుండె కలుక్కుమనే వాస్తవాలు బయటపడ్డాయి. భారత్‌లోని పురుషులలో శుక్ర కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయనీ, అంతేగాక మిగిలిన కొద్దో గొప్పో శుక్రకణాలలో నాణ్యత లేదని నివేదిక వెల్లడించింది.
 
భారత పురుషులలో గణనీయంగా ఈ శుక్ర కణాల సంఖ్య తగ్గడమూ నాణ్యతాలోపానికి కారణం వివిధ రసాయన పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ కాలుష్యాలేనని తేలింది. ఆల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు సంబంధించిన డాక్టర్లు, నిపుణుల బృందం తెలిపిన వివరాల ప్రకారం, 30 సంవత్సరాల క్రితం భారతదేశ పురుషుడిలో శుక్రకణాల సంఖ్య ప్రతి మిల్లీ లీటరుకు 60 మిలియన్లు ఉండగా, ఇప్పుడది 20 మిలియన్లకు పడిపోయింది. పోనుపోను ఇది మరింత ప్రమాదస్థాయికి చేరే అవకాశముందని వెల్లడించారు.
 
ఏటా సగటున 12-18 మిలియన్ జంటలు ఈ నిస్సారత్వ సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు, ఈ పరిణామాలకు వ్యక్తిగతంగా ఎవరో ఒకరు మాత్రమే బాధ్యులు కారు, పెరిగిపోతున్న కాలుష్య కోరలలో మానవుడు చిక్కుకుని ఇలా అలమటిస్తున్నాడని వైద్యులు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవు నెయ్యి వంటకాలకు మంచిదేనా...? ఆవునెయ్యి ఎక్కువ తీసుకుంటే?