Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షాక్.. ఎబోలా మరో ఎయిడ్సా....? సెక్స్‌లో పాల్గొంటే వచ్చేసింది....

Advertiesment
Sexual transmission of Ebola virus in Liberia confirmed
, శుక్రవారం, 16 అక్టోబరు 2015 (18:14 IST)
సాధారణంగా ఎబోలా వైరస్ సోకిన రోగికి తగిన సమయంలో వైద్యం చేయకపోతే ఆ వ్యక్తి మరణించడం ఖాయం. అలాగే, ఎబోలా బారినపడి కోలుకున్న వ్యక్తితో ఏ మహిళ అయినా శృంగారంలో పాల్గొన్నట్టయితే, ఆ మహిళకు ఎబోలా వైరస్ సోకడం ఖాయమని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో నిరూపించారు. ఈ పరిశోధనను అమెరికా సైనిక శాస్త్రవేత్తలు, లైబీరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎల్ఐబీఆర్)లు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ పరిశోధన ఎలా చేశారంటే... 
 
ఒక మహిళ ఈ యేడాది మార్చి నెలలో ఎబోలా వైరస్ సోకింది. ఆమె నుంచి ఎబోలా పాజిటివ్ రక్త నమూనాలను సేకరించారు. ఆ తర్వాత ఈ మహిళ మృతి చెందింది. అయితే, ఈ మహిళ ఎబోలా వైరస్ బారిన పడకముందు.. ఈ వైరస్ బారినపడి కోలుకున్న వ్యక్తితో శృంగారంలో పాల్గొంది. ఆ తర్వాతే ఈ మహిళకు ఎబోలా వైరస్ సోకింది. 
 
దీంతో ఈ మహిళ రక్త నమూనాలను పరిశోధించారు. అలాగే, ఎబోలా బారినపడి కోలుకున్న వ్యక్తి వీర్య కణాలను కూడా సేకరించి పరిశోధించారు. ఇందులో ఎబోలా వైరస్ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే 'ఎబో నెగటివ్' వ్యక్తిగా నిర్ధారణ అయినప్పటికీ ఆ వ్యక్తి వీర్యకణాల్లో వైరస్ పూర్తిగా చావదు. అందువల్లే వీర్యకణాల ద్వారా మహిళ రక్తకణాల్లోకి ఎబోలా నేరుగా వ్యాపించింది అని జేసన్ లాండర్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. 
 
దీంతో ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వీర్యకణాల్లో దాగుండే ఎబోలా వైరస్ ఎంతకాలంపాటు సజీవంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడమేకాక ఎబోలా నివారణకు తీసుకోవాల్సిన రక్షణాత్మక చర్యలపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉన్నట్లు యూఎస్ ఆర్మీ మెడికల్ సైంటిస్ట్ గుస్తావో పలాసియో చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu