Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బర్గర్ల కంటే సమోసాలు ఎంతో బెటర్.. ఎందుకో తెలుసా?

జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయం

Advertiesment
బర్గర్ల కంటే సమోసాలు ఎంతో బెటర్.. ఎందుకో తెలుసా?
, బుధవారం, 29 నవంబరు 2017 (17:27 IST)
జంక్ ఫుడ్స్ అయిన పిజ్జాలు, బర్గర్లు వగైరా వగైరా ఆహార పదార్థాలను తినేవారిలో ఒబిసిటీ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు సైతం తప్పవని అంటున్నారు. అయితే సాయంత్రం పూట తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ల కంటే సమోసా బెటరని ఓ అధ్యయనంలో తేలింది.
 
అప్పుడప్పుడే నూనెలో వేయించే తాజా సమోసాలు ఆరోగ్యానికి మేలేనని సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వ‌హించిన తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. బాడీ బార్డ‌ర్: లైఫ్‌స్టైల్ డిసీసెస్ పేరుతో విడుద‌ల చేసిన ఈ నివేదిక‌లో స్థూల‌కాయ‌త్వం, మాన‌సిక ఎదుగుద‌ల‌, కేన్స‌ర్‌, హృద్రోగాల వంటి రోగాల‌కు ఆహార‌పు అల‌వాట్లకు మ‌ధ్య సంబంధం వున్నట్లు పరిశోధకులు వివరించారు. 
 
బర్గర్ కంటే సమోసాల్లో రసాయనాలు తక్కువగా వుంటాయని పరిశోధకులు కనుగొన్నారు. బర్గర్లతో సాస్, చీజ్.. ఇతర ప్రిజర్వ్ చేసే ఆహార పదార్థాలుంటాయి. ఇవి ఒబిసిటీకి దారితీసే అవకాశాలు అధికంగా వున్నాయి. అయితే సమోసాలో వుండే ఆలూ, పిండి పదార్థాలు సహజమైనవని.. వాటితో ఆరోగ్యానికి కాస్త మేలే జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 
 
సమోసాల్లో వుండే గోధుమ పిండి, ఉడికించిన ఆలూ, పచ్చి బఠాణీలు, ఉప్పు, పచ్చిమిర్చి, కూరగాయలు, నెయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధకులు తెలిపారు. 2016 సెప్టెంబర్ నుంచి మార్చి 2017 వరకు జరిగిన పరిశోధనలో 15 రాష్ట్రాలకు చెందిన 13వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 9-17 ఏళ్ల మధ్య గల విద్యార్థులపై ఈ పరిశోధన జరిపామని చెప్పారు. అధిక చక్కెర, ఉప్పు కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్, బేవరేజస్ వల్లనే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఈ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పనీర్ చికెన్ గ్రేవీ