Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్‌లో చేరిన ప్ర‌ముఖ సంతాన‌సాఫ‌ల్య నిపుణుడు డాక్ట‌ర్ కేడీ న‌య్య‌ర్

Image
, శనివారం, 10 డిశెంబరు 2022 (18:19 IST)
ప్ర‌ముఖ ఐవీఎఫ్ నిపుణుడు డాక్ట‌ర్ కేడీ న‌య్య‌ర్ అంత‌ర్జాతీయ అసిస్టెడ్ రీప్రొడ‌క్టివ్ టెక్నాల‌జీ అయిన ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్‌లో చేరుతున్నారు. ఈ సంద‌ర్భంగా హైటెక్ సిటీలోని హైద‌రాబాద్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఏఆర్‌టీ సంస్థ ఆయ‌న‌ను సాద‌రంగా స్వాగ‌తించింది. ఈ విలేక‌రుల స‌మావేశాన్ని ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్, ఇండియా కో-మెడిక‌ల్ డైరెక్ట‌ర్లు డాక్ట‌ర్ రిచా జ‌గ్‌త‌ప్‌, డాక్ట‌ర్ ప‌రుల్ క‌తియార్‌, ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ గ్రూప్ మెడిక‌ల్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ హుమాన్ ఫ‌తేమీ క‌లిసి నిర్వ‌హించారు.

 
ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ - ఐవీఐ మిడిల్ ఈస్ట్ బ్రాండ్ పేరుతో 2015లో ఏర్పాట‌య్యాయి. 2020లో దానిని ప్రస్తుత పేరుకు మార్చారు. ఇది స్థాపించినప్పటి నుంచి క్లినికల్ ఫలితాలు, రోగి సంతృప్తి, పరిశోధన, మానవ పునరుత్పత్తి, జన్యుశాస్త్రం రంగంలో బోధన విష‌యంలో అంత‌ర్జాతీయ ప్రామాణికంగా మారింది. మధ్యప్రాచ్యంలో కొత్త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్పిన తరువాత, ఈ చైన్‌ ఇప్పుడు భారతదేశానికి విస్తరిస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, ముంబైలలో ఈ సంస్థకు ఆరు క్లినిక్‌లు ఉన్నాయి. ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్‌ల చైన్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విజయాల‌ రేటు.. అంటే 70% ఉంది.

 
తాను చేర‌డంపై డాక్టర్ నయ్యర్ మాట్లాడుతూ, “ఇది నాకు ఒక పెద్ద ముందడుగు అని భావిస్తున్నాను. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పునరుత్పత్తి క్లినిక్ చైన్‌లో చేరడం నాకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. క్లినిక్ తదుపరి ఎదుగుదలకు నేను ఎంతో దోహదపడగలనని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను” అన్నారు. 

 
ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫతేమి.. ముందుగా డాక్టర్ నయ్యర్‌ను భారతదేశంలోని ఏఆర్‌టీ క్లినిక్స్‌కు స్వాగతించారు.  అనంత‌రం ఆమె మాట్లాడుతూ, “డాక్టర్ నయ్యర్ లాంటి నిపుణుల‌ను.. స్థాపించిన‌ప్ప‌టి నుంచి నాకు అనుబంధం ఉన్న ఈ క్లినిక్‌లోకి స్వాగ‌తిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ నయ్యర్ సమగ్ర అనుభవం చాలా విలువైనది. ఎందుకంటే ఆయ‌న‌కున్న దశాబ్దాల అనుభవంలో, ఐవీఎఫ్ ప్రక్రియలను నిర్వహించే సమయంలో తలెత్తే అన్ని ర‌కాల సమస్యలను పరిష్కరించారు” అని చెప్పారు.

 
డాక్టర్ నయ్యర్‌కు భారతదేశంలోని ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ కో-మెడికల్ డైరెక్టర్లు కూడా సంతోషంగా స్వాగతం పలికారు. డాక్టర్ నయ్యర్‌కు స్వాగతం పలుకుతూ, డాక్టర్ జ‌గ్‌త‌ప్‌ మాట్లాడుతూ, "మా బృందంలోకి డాక్టర్ నయ్యర్‌కు స్వాగతం పలకడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న విజ్ఞానం, అనుభవం, విజయవంతమైన వైద్యచికిత్స‌ ఫలితాల అధిక రేటును పరిగణనలోకి తీసుకుంటే, ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇండియా దేశవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తుందని నేను క‌చ్చితంగా న‌మ్ముతున్నాను” అని తెలిపారు.

 
అనంత‌రం డాక్ట‌ర్ క‌తియార్ మాట్లాడుతూ, “పున‌రుత్పాద‌క చికిత్స‌ల‌లో అంత‌ర్జాతీయంగా ప్ర‌ఖ్యాతి గాంచిన డాక్ట‌ర్ న‌య్య‌ర్.. వైద్యరంగంలోనే చాలా సీనియ‌ర్‌. ఈ రంగంలో ఆయ‌న‌కు ఉన్న లోతైన విష‌య‌ప‌రిజ్ఞానంతో ఏఆర్‌టీ క్లినిక్స్ ఎంతో ప్ర‌యోజ‌నం పొందుతుంది. భార‌త‌దేశంలో మా విజ‌య‌గాధ‌ను రాయ‌డానికి ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

 
ఏఆర్‌టీ క్లినిక్స్ ఇండియా సీఈఓ డాక్ట‌ర్ సోమేష్ మిట్ట‌ల్ కూడా కో-మెడిక‌ల్ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ఇలా మాట్లాడారు. “ఐవీఎఫ్‌లో అత్యాధునిక టెక్నాల‌జీలు, టెక్నిక్‌ల గురించి డాక్ట‌ర్ న‌య్య‌ర్‌కు చాలా బాగా తెలుసు. ఆయ‌న భార‌త‌దేశం, విదేశాల‌కు చెందిన చాలామందికి సంతాన‌సాఫ‌ల్య చికిత్స‌లు చేశారు. భార‌త‌దేశంలో ఏఆర్‌టీ ఫెర్టిలిటీ క్లినిక్స్ చైన్ మ‌రింత‌గా విస్త‌రించ‌డానికి ఆయ‌న నైపుణ్యాలు సాయ‌ప‌డ‌తాయి. ఆయ‌న మా క్లినీషియ‌న్ల బృందంలో ఒక ప్ర‌ముఖుడిగా చేరుతార‌ని నేను ఎదురుచూస్తున్నాను. భార‌త‌దేశంలో కేవ‌లం మెట్రో న‌గ‌రాల్లోనే కాక ఇత‌ర ప్రాంతాల్లోనూ మేం విస్త‌రించ‌డానికి ఆయ‌న పేరు ప్ర‌ఖ్యాతులు, సేవ‌లు మ‌రింత పెద్ద స్థాయిలో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నాను” అన్నారు. డాక్ట‌ర్ న‌య్య‌ర్ సాధించిన విజ‌యాలు, ఆయ‌న‌కు వ‌చ్చిన అవార్డుల వివ‌రాల‌ను డాక్ట‌ర్ జ‌గ్‌త‌ప్‌, డాక్ట‌ర్ ఫ‌తేమి, డాక్ట‌ర్ క‌తియార్ మీడియాకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గసగసాలు చేసే మేలు ఏమిటి?