Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దంతరక్షణ కోసం రెడ్ వైన్ సేవించండి.

Advertiesment
Red wine
, శనివారం, 21 జూన్ 2014 (17:28 IST)
రెడ్ వైన్ సేవించడం వలన గుండె, వివిధ రకాల క్యాన్సర్‌ల బారిన పడకుండా కాపాడబడుతుందని ఎన్నో పరిశోధనల ద్వారా తెలుసుకున్నాం. కాని మరో పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే దంత సంరక్షణలోను రెడ్ వైన్ చాలా తోడ్పాటునందిస్తుంది. ఈ విషయాన్ని ఇటలీకి చెందిన పేవియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం వెల్లడించింది. 
 
స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియా దంతాలకు ప్రథమ శత్రువు. ఈ బ్యాక్టీరియా చక్కెర ఎక్కువగా తింటుంటే దంతాలలోకి చాలా సునాయాసంగా చొరబడుతుంది. చక్కెర ఎక్కువగా తినేవారిలో ఈ బ్యాక్టీరియా ప్రవేశించి దంతాలకు రంధ్రాలు చేసేస్తుంది. దీంతో దంతాలు పాడైపోతాయని పరిశోధకులు తెలిపారు.
 
రెడ్ వైన్‌లోనున్న రసాయనాలు దంతాలకు హాని చేసే స్ట్రెప్టోకోకస్ మ్యూటెంస్ బ్యాక్టీరియాను దరి చేరనీయవని పరిశోధకులు తెలిపారు. 
 
కాసింత రెడ్ వైన్ తీసుకున్నా కూడా ఈ బ్యాక్టీరియాను అంతం చేస్తుందని తమ పరిశోధనలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. రెడ్ వైన్ దంతాలలోకి ప్రవేశించిన తర్వాత దంతాలను నాశనం చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానిని అక్కడికక్కడే చంపేస్తుందన్నారు. 
 
దంతాలను సురక్షితంగా ఉంచుకోవాలని రెడ్ వైన్ తీసుకుంటేనే బ్యాక్టీరియా నశిస్తుందునుకోవడం పొరబడ్డట్టే. ఇందులోనున్న ఇతర పదార్థాలలో ఈ బ్యాక్టీరియాను సంహరించే గుణం ఉంటుందంటున్నారు పరిశోధకులు. 

Share this Story:

Follow Webdunia telugu