Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెల్లుల్లిని తలదిండు కింద పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందా.. ప్యాకెట్లో పెట్టుకుంటే?

వెల్లుల్లి ప్రతి యొక్కరి ఇంట్లో ఉండే సహజ ఔషదం. రోజు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో విరివిగా వాడుతుంటాం. దీనివలన ఎన్న

Advertiesment
Putting
, గురువారం, 11 ఆగస్టు 2016 (12:46 IST)
వెల్లుల్లి ప్రతి యొక్కరి ఇంట్లో ఉండే సహజ ఔషదం. రోజు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో విరివిగా వాడుతుంటాం. దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిని వంటల్లోనే కాదు ఇతర విషయాలకు ఆరోగ్య సమస్యలకు నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది.
 
కాలేయ సమస్యలు, బట్టతలను రాకుండా చేయడం, ధమనులను శుభ్రపరచడం, జలుబు నుంచి త్వరిత ఉపశమనం కలుగిస్తుంది. అయితే ఈ వెల్లుల్లిని ఈజిప్ట్ దేశ ప్రజలు వంటల్లో ఉపయోగించరట.. అలాగే పచ్చిగా నమిలితింటారట. వెల్లుల్లిని నలిపి 15 నిమిషాలు ఉంచి ఆ తరువాత తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయని వారు నమ్ముతారట.
 
అంతేకాకుండా.. వెల్లుల్లిని పార్స్లీ ఆకులు, నూనెతో కలిపి తీసుకుంటే శరీరంలోని దుర్వాసనను దూరం చెయ్యొచ్చు. కొంతమంది పడుకునే ముందు వెల్లుల్లిని తమ తలదిండు కింద పెట్టుకుంటారట. మరికొంతమంది అదృష్టం వరిస్తుందని వెల్లుల్లిని జేబులో పెట్టుకుని తిరుగుతుంటారట. అందుకే వెల్లుల్లిని మీ దిండు కింద గాని, జేబులో గాని పెట్టుకుని అదృష్టాన్ని పరిక్షించుకోండి. ఇలా చేస్తే దుష్టశక్తులు కూడా దరిచేరవట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళదుంపతో చర్మానికి ఎంతో మేలు.. ట్యాన్ తొలగిపోవాలంటే?