Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండెపోటు అనంతరం డిస్క్ ప్రోలాప్స్‌తో బాధపడుతున్న 35 ఏళ్ల రోగిని రక్షించిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యులు

Heart attack

ఐవీఆర్

, మంగళవారం, 12 మార్చి 2024 (18:22 IST)
ఇటీవల గుండెపోటు ఎదుర్కోవటంతో పాటుగా డిస్క్ ప్రోలాప్స్‌తో బాధపడుతున్న 35 ఏళ్ల రోగికి చికిత్స కోసం మల్టీడిసిప్లినరీ విధానం అనుసరించటం ద్వారా రోగి-కేంద్రీకృత సంరక్షణలో సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ మార్గదర్శకంగా నిలిచింది. తొలుత శ్రీ సుజిత్ రెడ్డి (పేరు మార్పు) ఛాతీ నొప్పితో హాస్పిటల్‌కు వచ్చారు. ఆయనకు మధుమేహం, రక్తపోటు చరిత్ర వుంది. తదుపరి పరీక్షల తర్వాత, రోగికి గుండెపోటు ఉన్నట్లు నిర్ధారణ అయింది. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కార్డియాక్ టీమ్ వేగంగా జోక్యం చేసుకుని, అతనికి స్టెంట్‌ వేయడంతో పాటు అతను త్వరగా కోలుకోటానికి అవసరమైన చికిత్స ప్రారంభించింది.
 
కొన్ని నెలల తర్వాత, శ్రీ రెడ్డి తన కుడి భుజం తీవ్రమైన మెడ నొప్పిని ఎదుర్కొంటున్నట్లు హాస్పిటల్‌కు వచ్చారు. న్యూరో కన్సల్టేషన్‌ను తర్వాత, కుడి పారాసెంట్రల్ డిస్క్ ప్రోలాప్స్ కారణంగా నరాలు ఒత్తిడికి గురైనట్లు గుర్తించారు. ఇది ఒక గడ్డను సూచిస్తుంది, వెన్నెముక మధ్యలో ఉంటుందని చెబుతారు కానీ ఇది ఎడమ లేదా కుడి పక్కకు ఉండవచ్చు. కానీ, వైద్యపరంగా, పారాసెంట్రల్ అంటే, సెంటర్ సమీపంలోకి అన్నట్లుగా వుంటుంది.
 
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురు చైతన్య కుమార్ సి ఈ కేసు గురించి వివరిస్తూ, “శ్రీ రెడ్డి కేసు, ఇటీవలి గుండెపోటుకు సంబంధించిన కరోనరీ జోక్యం కారణంగా ఒక ప్రత్యేకమైన సవాలును అందించింది. స్టెంట్ యొక్క ప్లేస్‌మెంట్‌ కారణంగా, స్టెంట్‌కు అడ్డుపడకుండా నిరోధించడానికి బ్లడ్ థిన్నర్‌లను కొనసాగించడం అతనికి కీలకం. అయినప్పటికీ, అతనికి చేయబోయే డిస్క్ సర్జరీకి శస్త్రచికిత్స సమయంలో అయ్యే రక్తస్రావం, స్టెంట్ పూడుకుపోయే ప్రమాదాలను సమతుల్యం చేయడానికి భిన్నమైన విధానం అనుసరించాల్సి వుంది.  యాంటీప్లేట్‌లెట్ యాక్షన్, శస్త్రచికిత్స జోక్యాన్ని సమతుల్యం చేయడంలో ఇంజెక్షన్ కాంగ్రేలర్ కీలక పాత్ర పోషించటంతో పాటుగా రోగికి మెరుగైన ఫలితాలను అందించింది" అని అన్నారు.  
 
స్టెంట్ ప్లేస్‌మెంట్ ఉన్న రోగులకు గుండెపోటు యొక్క ప్రమాదాన్ని నివారించడానికి రక్తం పలుచగా ఉండే మందులు వాడటం అవసరం. శస్త్రచికిత్స అవసరమైనప్పుడు ఈ ఆవశ్యకత ఒక సవాలుగా ఉంటుంది, శస్త్రచికిత్సా ప్రక్రియ సమయంలో రక్తాన్ని పలచగా చేయడం కొనసాగించినట్లయితే రక్తస్రావ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అందువల్ల, రోగి భద్రత, సరైన శస్త్రచికిత్స ఫలితాలను నిర్ధారించడానికి సమతుల్యతను పాటించాలి.
 
శ్రీ రెడ్డి సంరక్షణ ప్రయాణంలో ఇంజెక్షన్ కాంగ్రేలర్ యొక్క ఆవశ్యకతను సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రాజేష్ రెడ్డి సన్నారెడ్డి వివరిస్తూ "శ్రీ రెడ్డి తరహా కేసుల్లో, అంటే, హృదయనాళ- నాడీ శస్త్ర చికిత్సలు కలిసేటటువంటి సందర్భాల్లో, అనుకూలమైన విధానం తప్పనిసరి. ఇంజెక్షన్ కాంగ్రేలర్ యొక్క ఉపయోగం అవసరమైన యాంటీ ప్లేట్‌లెట్ చర్యను అందించింది, ఇది సురక్షితమైన శస్త్రచికిత్స జోక్యాన్ని సులభతరం చేస్తుంది. ఇది రోగి సంరక్షణ కోసం వినూత్న వ్యూహం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ 7 చిట్కాలతో మెత్తగా దూది పింజల్లా వుండే ఇడ్లీలు, ఎలా?