రెండు మెదళ్లను కలపవచ్చా.. ఆ మెదడు ఏమి చెబుతోందో ఈ మెదడుకు పంపవచ్చా.. ఆ మెదడు అడిగే ప్రశ్నలకు ఈ మెదడుతో సమాధానం ఇవ్వవచ్చా.. అదే నోటితో పని లేకుండా చేయవచ్చా.. అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. అయితే వాషింగ్టన్‌కు చెందిన పలువురు పరిశోధకలు ఈ ప్రయత్నాలు చేశారు. రెండు మెదళ్లను కలిపారు.
దాదాపుగా 1.5కిలో మీటర్ల దూరంలో ఉన్న రెండు మెదళ్ళను ప్రత్యేక సాధనాల ద్వారా ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశారు. ఆ రెండింటిని నెట్ ద్వారా కలపారు. ఆ మెదడులోని సంకేతాలను ఈ మెదడుకు నెట్ ద్వారా పంపారు. ఈ ప్రయోగం ద్వారా ఒక మెదడు ఏమి ఆలోచిస్తోందో రెండో మెదడు ఊహించే విధంగా పరిశోధన చేశారు.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆండ్రియా స్టాక్కో ఈ ప్రయోగం చేశారు. ఇద్దరు వ్యక్తుల కొలాబ్రేషన్ ద్వారానే సాధ్యమయ్యింది. మొదటి వ్యక్తికి ఈఈజీ క్యాప్‌ను తొడిగారు. ఇది ఆ వ్యక్తి మెదడు యాక్టివిటీని పసిగడుతుంది. ఈ సిగ్నల్స్‌ను 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసీవర్‌కు పంపారు.
ఆ రిసీవర్ ఐచ్చిక ప్రశ్నావళి రూపంలో రెండో వ్యక్తికి పంపారు. వచ్చిన సంకేతాల ఆధారంగా రెండో వ్యక్తి ఖచ్చితమైన సమాధానాన్ని ఎన్నుకున్నారు. దీని ద్వారా ఒకరి మెదడులోని ఆలోచనలను తెలుసుకోవడానికి మార్గం ఏర్పుడతుందని చెబుతున్నారు.