గోళ్లను కొరికితే మానసిక వ్యాధి తప్పదా?
చేతి గోళ్లను కొరికే అలవాటు చాలామందికి వుంటుంది. అయితే ఈ అలవాటు మానసిక వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్ళను పంటితో కొరికే అలవాటు చిన్నతనం నుంచే ప్రారంభమవుతుంది. ఆ అలవాటు పెద్దైనా
చేతి గోళ్లను కొరికే అలవాటు చాలామందికి వుంటుంది. అయితే ఈ అలవాటు మానసిక వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గోళ్ళను పంటితో కొరికే అలవాటు చిన్నతనం నుంచే ప్రారంభమవుతుంది. ఆ అలవాటు పెద్దైనా అలానే కొనసాగుతుంది.
కొందరు ఈ అలవాటుకు దూరమైన.. మరికొందరు మాత్రం గోళ్లను కొరికే అలవాటును మానుకోలేరు. అలాంటి వాళ్లలో భయం, ప్రతికూల ఆలోచనలు ఉత్పన్నమవుతాయని.. తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గోళ్లను కొరికే అలవాటు మానసికంగానే కాకుండా శారీరకంగానూ చెడు ప్రభావాన్ని చూపుతుంది. గోళ్లను కొరకడం ద్వారా వాటిలో ఉండే దుమ్ము నోటిద్వారా కడుపులోకి చేరుతుంది. తద్వారా వ్యాధులు ఏర్పడతాయి. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.