Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎండలు మండే దేశంలో సెంటూ.. ఆపైన డియోడరెంటూ.. ఆహా..!

అరబ్ దేశాల ప్రజలు విస్తృతంగా వాడే సెంట్ల గురించి చాలా కాలంగా మన దేశంలో ఒక వార్త ప్రచారంలో ఉండేది. ఎడారి దేశాలు కాబట్టి, శతాబ్దాలుగా నీటికి కటకట ఉండేది కాబట్టి. అక్కడి ప్రజలు రోజూ స్నానం చేయడం సాధ్యం క

Advertiesment
body odour
హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (22:11 IST)
అరబ్ దేశాల ప్రజలు విస్తృతంగా వాడే సెంట్ల గురించి చాలా కాలంగా మన దేశంలో ఒక వార్త ప్రచారంలో ఉండేది. ఎడారి దేశాలు కాబట్టి, శతాబ్దాలుగా నీటికి కటకట ఉండేది కాబట్టి. అక్కడి ప్రజలు రోజూ స్నానం చేయడం సాధ్యం కాక బట్టలకు సెంటు క్రమం తప్పకుండా పూసుకుంటారని, ఆ రకంగా చమట కంపుకు దూరంగా ఉంటారని మన దేశంలో చెప్పుకోవటం అలవాటు. కానీ ఇప్పుడు ఖండాంతరాలనుంచి నీళ్లు సప్లయ్ అవుతున్న టెక్నాలజీ యుగంలో అరబ్ దేశాలకు నీటి కొరత లేకపోవచ్చు కానీ అరబ్బుల సెంటు వాడకం గురించిన ప్రచారాలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. 
 
మన దేశంలో కూడా ప్రపంచీకరణ తర్వాత కాస్మొటిక్స్‌కు విపరీతంగా ఆదరణ పెరిగింది. ఆడా మగా తేడా లేకుండా సెంట్లు, డియోడరెంట్లు వాడటం మనకు బాగా అలవాటయిపోయింది. అయితే స్నానం చేయకుండా ఉన్నప్పుడు లేదా చెమట పట్టినప్పుడు సెంటు పూసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా అది శరీర దుర్వాసనను మరింతగా పెంచుతుందని వైద్యులు ఉంటున్నారు. శరీరం వాసన వేసినా, చమటపట్టినా దానికి పరిష్కారం అవకాశం ఉంటే వెంటనే స్నానం చేయడమే కానీ కృత్రిమ పరిమళాలను, రకరకాల సెంట్లను వాడటం వల్ల లాభం లేదని వైద్య శాస్త్రం చెబుతోంది.
 
సైనిక జీవితంలో నిత్యం స్నానం చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ పౌర జీవితంలో స్నానం అనేది మనిషి శరీరం కోరుకునే అలిఖిత ప్రాథమిక హక్కుల్లో ఒక్కటి. పైగా స్నానం ప్రజారోగ్యానికి అమితంగా తోడ్పడే ఆరోగ్య సంరక్షణ విధానం కూడా. కానీ  శరీరం వాసన వస్తుంటే... చాలా మంది చేసే మొదటి పని డియోడరెంటో, సెంటో కొట్టుకుని వెళ్లిపోవడం. అయితే ఇక్కడ చిక్కు ఏమిటంటే సరైనవి వాడకపోతే ఆ సెంట్లు మరింతగా సమస్యను పెంచుతాయి. ఒక వేళ  ఎప్పుడూ కూడా ఎక్కువశాతం నీళ్లతో తయారైన డియోలను వాడడమే మంచింది.
 
చెమట పట్టి శరీరం వాసన వస్తున్న సమయంలో అస్సలు సెంట్ కొట్టకండి. ఇది శరీర దుర్వాసను పెంచుతుంది. కొన్న నిమిషాల పాటూ మీకు మంచి సెంట్ వాసన వచ్చినా... ఆ తరువాత మాత్రం దుర్వాసన మొదలవుతుంది. కనీసం మీరు కూడా ఆ వాసనను భరించలేరు. ఆఫీసుకు సమయం మించి పోయిందనో, పనుందనో స్నానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయద్దు. స్నానం మన శరీరానికి వ్యాక్సినేషన్ వంటిది. బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. శరీర దుర్వాసన సమస్య ఎక్కువగా ఉన్నవారు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తే... మంచి ఫలితం ఉంటుంది.
 
పైగా...శరీర దుర్వాసన సమస్య అధికంగా ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు వంటివి శరీర దుర్వాసనను పెంచుతాయి. కనుక వీటిని అధికంగా తీసుకోకుండా... తగ్గించి తినాలి. జింక్, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తినాలి.
 
చివరగా ఒక్కమాట.. మీ శరీరం మీది. తర్వాత సమాజానిది కూడా..  శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి విధి, బాధ్యత కూడా. కాని సెంట్లతోనూ, డియోడరెంట్లతోనూ కాదు. శరీర కంపుకు స్నానమొక్కటే పైసా ఖర్చులేని ఉత్తమ పరిష్కారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లూ.. ఉద్యోగం.. మహిళలు రెండు యుద్ధాలు చేయాల్సిందేనా?