Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయిలకు హెచ్చరిక... రోజుకో రకంగా హెయిర్ స్టైల్... జుట్టు ఊడిపోద్ది జాగ్రత్త....

అమ్మాయిలు రోజుకో రకంగా హెయిర్ స్టయిల్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ ఇలాంటి హెయిర్ స్టయిల్సులో కొన్ని రకాలైనవి జుట్టు ఊడిపోయేందుకు దోహదమవుతున్నాయంటూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టయిల్స్‌‍కి జుట్టు ఊడిపోవడానికి మధ్య గల కారణాలను వా

Advertiesment
అమ్మాయిలకు హెచ్చరిక... రోజుకో రకంగా హెయిర్ స్టైల్... జుట్టు ఊడిపోద్ది జాగ్రత్త....
, బుధవారం, 22 జూన్ 2016 (16:47 IST)
అమ్మాయిలు రోజుకో రకంగా హెయిర్ స్టయిల్ వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ ఇలాంటి హెయిర్ స్టయిల్సులో కొన్ని రకాలైనవి జుట్టు ఊడిపోయేందుకు దోహదమవుతున్నాయంటూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ స్టయిల్స్‌‍కి జుట్టు ఊడిపోవడానికి మధ్య గల కారణాలను వారు విశ్లేషించారు.
 
జుట్టు ఎందుకు ఊడిపోతుందన్న దానిపై అధ్యయనం చేసేందుకు ఆఫ్రికన్-అమెరికన్ మహిళలను కొంతమందిని ఎంపిక చేశారు. ఐతే వీరిలో కొంతమంది ఎంతో ఇష్టంగా వేసుకునే హెయిర్ స్టయిల్స్ వల్ల వారి జుట్టు ఊడిపోతున్నట్లు కనుగొన్నారు. ఐతే కొన్ని రకాల హెయిర్ స్టయిల్స్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయనీ, అయినప్పటికీ ఈ హెయిర్ స్టయిల్స్ కారణంగానే జుట్టు రాలిపోతున్నట్లు కనుగొన్నారు. జుట్టు ఊడుతున్నప్పుడు వేసుకుంటున్న హెయిర్ ఎలాంటిదో ఓసారి చెక్ చేసుకోవాలంటున్నారు శాస్త్రజ్ఞులు. వేసుకునే హెయిర్ స్టయిల్స్ ను బట్టి జుట్టు ఊడిపోవడాన్ని మూడు భాగాలుగా వర్గీకరించారు. 
 
అందులో మొదటిది... జుట్టును బాగా బిగుతుగా లాగి జడ వేయడం. పిన్నులు, తదితర అలంకరణల సామాగ్రిని కేశాలపై గట్టిగా పెట్టి లోనికి గాలి ఆడకుండా చేయడం వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. మధ్యస్తంగా.. అంటే జుట్టు రాలడం ఓ మాస్తరుగా ఉండేవారిలో జడ వేసుకోవడం కాస్తంత వదులుగా వేసుకున్నప్పటికీ కేశ సంరక్షణ చర్యలు తీసుకోని కారణంగా వీరిలోనూ జుట్టు రాలిపోవడం ఉంటుంది.  జుట్టు ఊడకుండా బలిష్టంగా ఉండాలంటే కేశాలను గట్టిగా ముడిపేయకుండా అలా వదిలేయడమే. కాబట్టి జుట్టు ఊడుతుందని  గమనించినప్పుడు హెయిర్ స్టయిల్స్ మార్చుకోవడం మంచిదంటున్నారు వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరేడు పండ్ల సీజన్... నేరేడుతో ఏమేమి తగ్గుతాయో తెలుసా...?