పెరిగిన డిమాండ్.. ప్రపంచ వ్యాప్తంగా కండోమ్‌ల కొరత

శనివారం, 28 మార్చి 2020 (13:05 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ప్రజలు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీంతో శారీరకంగా కలుసుకోవడం ఎక్కువైంది. ఫలితంగా కండోమ్‌ల వాడకం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదేసమయంలో కండోమ్‌ల ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివవరాలను పరిశీలిస్తే, క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కండోమ్‌ల ఉత్ప‌త్తి తగ్గిపోయింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక సంఖ్య‌లో కండోమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే కేరెక్స్ బెర్‌హాద్ సంస్థ దీనిపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మ‌లేషియాకు చెందిన ఆ కంపెనీ గ‌త వారం నుంచి ఒక్క కండోమ్‌ను కూడా ఉత్ప‌త్తి చేయ‌లేదని ప్రకటించింది. 
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ఒక‌రు ఈ కంపెనీ ఉత్పత్తి చేసే కండోమ్‌లనే వినియోగిస్తున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆంక్ష‌లు క‌ఠినంగా ఉండటంతో వీటి ఉత్పత్తిని నిలిపివేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వంద మిలియ‌న్ల కండోమ్‌ల కొర‌త ఉన్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. 
 
డ్యూరెక్స్ లాంటి మేటి బ్రాండ్‌ కండోమ్‌ల‌ను ఈ సంస్థ‌నే ఉత్ప‌త్తి చేస్తుంది. బ్రిట‌న్‌కు చెందిన ఎన్‌హెచ్ఎస్‌తో పాటు ఐక్య‌రాజ్య‌స‌మితి చేప‌ట్టే అనేక కార్య‌క్ర‌మాల‌కు ఈ కంపెనీ కండోమ్‌ల‌ను పంపిణీ చేస్తుంది. కండోమ్‌ల ఉత్ప‌త్తికి ఈ శుక్ర‌వారం అనుమ‌తి ఇచ్చినా.. కేవ‌లం 50 శాతం మాత్ర‌మే ఉత్ప‌త్తి చేయగలిగారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గ్యాస్ట్రిక్ దోషాలు వున్నవారికి ఇది మంచి మందు