Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్‌తో తీవ్రమైన ఒత్తిడి... తస్మాత్ జాగ్రత్త

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటారా? మెయిళ్ళు, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటివి పదే పదే చూసుకుంటుంటారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవుననే అయితే మీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రతి ఐదుగ

Advertiesment
depression with smart phones
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (22:46 IST)
స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతుంటారా? మెయిళ్ళు, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటివి పదే పదే చూసుకుంటుంటారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం అవుననే అయితే మీరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రతి ఐదుగురు యువకుల్లో నలుగురు స్మార్ట్ ఫోన్లు, మెయిల్ళు, సోషియల్ మీడియా అప్‌‌డేట్లు పదేపదే చూసుకుంటున్నారని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ పరిశీలనలో తేలింది. 
 
సోషల్ మీడియా, టెక్నాలజీల అధిక వినియోగమే స్మార్ట్ ఫోన్‌కు అతుక్కుపోవడానికి ప్రధాన కారణం. దీనివల్ల సామాజికంగా కుటుంబ పరంగా బంధాలు క్షీణించడమే కాక అధిక ఒత్తిడికి లోనవుతున్నారట. స్మార్ట్ ఫోన్ వినియోగించే వారిపై పడుతున్న ఒత్తిడిని 1 నుంచి 10పాయింట్ల వరకు విభజిస్తే అధికంగా ఫోన్ ను చెక్ చేసే వారిపై సగటున 5.3పాయింట్ల ఒత్తిడి పడుతోందని ఎపిఏ తెలిపింది.
 
రోజులో ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసుకునే వారిలో ఇది 4.4.గా ఉందట. ఇక ఉద్యోగాలు చేసేవారు సెలవురోజు కూడా వారి మెయిళ్ళు చూసుకున్నట్లయితే ఇటువంటి వారిపై ఆరు పాయింట్ల వరకు ఒత్తిడి పడుతోందట. ఇలా స్మార్ట్ ఫోన్లలకు అధికంగా వినియోగిస్తున్న పిల్లలు ఉన్న ఇళ్ళలో 94శాతం వరకు ఒత్తిడికి గురవుతున్నారని ఎపిఏ పేర్కొంది. 18 యేళ్ళకు పైబడిన 3.511 మందిపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాడట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పులు చేసి.. పొలాలు అమ్ముకుని అమెరికాకు రావొద్దంటున్న ఎన్నారైలు