Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

Advertiesment
image

ఐవీఆర్

, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:07 IST)
హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీ హబ్ వేదికగా టీకన్సల్ట్ ఇంటిగ్రేటేడ్ హెల్త్ నెట్ వర్క్ సహకారంతో  రెండు రోజుల పాటు జరిగిన సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో ప్రఖ్యాత వైద్య నిపుణులు, ఆరోగ్య పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొని సమగ్ర వైద్య పరిష్కారాల భవిష్యత్తుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేచురోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజుతో పాటు, డివిస్ లాబోరేటరీస్  సహ వ్యవస్థాపకుడు డాక్టర్ దివి మధుసూదన్ రావు, యశోధ ఆస్పత్రి నుండి డా. కీర్తి, కేర్ ఆస్పత్రి నుండి డా. నింద్రా అరుమగం, నిమ్స్ నుండి డా. రమేష్ మార్త, వెల్ నెస్ హాస్పిటల్స్ నుండి డా. జె.ఎన్ వెంకట్, కిమ్స్ ఆస్పత్రి నుండి డా. మేక ప్రత్యూష, గ్లోబల్ హాస్పిటల్ నుండి డా. నవీన్ రెడ్డి, రెయిన్ బో హాస్పిటల్ నుండి డా. పూజిత సూరపనేని, ఒమేగా నుండి  డా. రితేష్ రంజన్ పాల్గొన్నారు. 
 
ఏఐ ఆధారిత ప్రత్యక్ష అనువాదంతో ఆరోగ్య విప్లవం
ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా మంతెన సత్యనారాయణ రాజు ప్రసంగం నిలిచింది. ఆయన తెలుగులో మాట్లాడినా, టీకన్పల్ట్ ఏఐ  సాంకేతికత ద్వారా 60 దేశాల్లోని ప్రజలకు 13 భాషల్లో ప్రత్యక్ష అనువాదంతో అందించబడింది. ఇది సాంప్రదాయ ఆరోగ్య పరిష్కారాలను ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప అవకాశంగా మారింది.సాంప్రదాయ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు టీకన్సల్ట్  చేసే కృషిని అభినందించిన మంతెన, నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ముఖ్యమైన సూచనలు చేశారు. ముఖ్యంగా టెక్నోక్రాట్లు, అస్థిర షిఫ్ట్‌ల్లో పని చేసే వారికోసం ఆయన యోగా, మొలకలు, సమయానికి భోజనం వంటి ఆరోగ్య పద్ధతులను పాటించాలని సూచించారు.
 
సమగ్ర ఆరోగ్య సంరక్షణకు ఏకీకృత దృక్పథం
సదస్సులో టీ కన్సల్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాలా మాట్లాడుతూ, సమగ్ర వైద్య విధానాలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. భారతదేశపు సంప్రదాయ వైద్య పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం ద్వారా మెడికల్ టూరిజం మరియు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతాయని వివరించారు.సాంప్రదాయ వైద్య నిపుణులతో కలిసి పనిచేసేందుకు తాను దేశవ్యాప్తంగా పర్యటిస్తానని సందీప్ మక్తాలా తెలిపారు. వ్యక్తిగతంగా వైద్య సేవలు అందించే నిపుణులు సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.ప్రపంచ ఆరోగ్య సంస్కృతిలో కొత్త అధ్యాయం63 దేశాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించుకున్న టీకన్సల్ట్ కొలబ్రెషన్ కాన్ క్లేవ్ 2025 ఆధునిక వైద్యం మరియు సాంప్రదాయ వైద్య విధానాలను కలిపే ఒక సమగ్ర ఆరోగ్య వ్యవస్థను సృష్టించడంలో కీలక మైలురాయిగా నిలిచింది.
 
కార్యక్రమం ముఖ్యాంశాలు: 
ప్రపంచవ్యాప్త ఆవిష్కరణ: మంతెన సత్యనారాయణ రాజు ప్రసంగం 60 దేశాలకు, 13 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
వైద్య నిపుణుల మద్దతు: ప్రముఖ ఆసుపత్రులు మరియు ఔషధ పరిశ్రమ నాయకులు సమగ్ర ఆరోగ్య సంరక్షణ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
మెడికల్ టూరిజం & ఆర్థిక వృద్ధి: భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం ద్వారా మెడికల్ టూరిజాన్ని పెంపొందించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యం.
భవిష్యత్ కార్యాచరణ: సంప్రదాయ వైద్య నిపుణులతో భాగస్వామ్యం పెంచి సమగ్ర ఆరోగ్య సంరక్షణను ప్రధాన వైద్య విధానంగా రూపొందించేందుకు టీ కన్సల్ట్ కృషి చేయనుంది.
 
టీకన్సల్ట్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధతటీకన్సల్ట్ కొలబ్రేషన్ కాన్ క్లేవ్ 2025 విజయవంతంగా ముగియడం, ప్రపంచవ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య విధానాల స్వీకరణ పెరుగుతున్నదనాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఆధునిక వైద్యం, ఆయుర్వేదం, నేచురోపతి, హోమియోపతి మరియు ఇతర సంప్రదాయ వైద్య విధానాలను సమగ్రంగా అందించే లక్ష్యంతో టీకన్సల్ట్ తన ప్రస్థానాన్ని కొనసాగించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు