Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపాల్ హస్పిటల్ వారిచే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్స నిర్వహణ

Advertiesment
Complicated Bariatric Surgery
, ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:07 IST)
ప్రస్తుతం కరోనా మహమ్మారి సమయంలో, సరైన రోగనిర్ధారణ మరియు చికిత్సలు అందటం చాల కీలకమైనవి. రోగి యొక్క స్థితిని బట్టి వారికి కావలసిన సరైన చికిత్స అందించటంలో మణిపాల్ హాస్పిటల్ అందెవేసిన చేయి అని చెప్పవచ్చును.
 
వివరాలలోకి వెళితే రోగి దాదాపు 124 కిలో గ్రాముల బరువుతో, లివర్ మధుమేహ వ్యాధితో ఎంతో ఇబ్బంది పడుతూ,  హైదరాబాదు, గుంటూరు మరియు విజయవాడలో అనేక  హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, తన సమస్య పరిష్కారం దొరకక, చివరికి మణిపాల్ హాస్పిటల్ గురించి తెలుసుకొని, అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించడం జరిగింది.
 
ఈ సమావేశంలో డా.మురళీకృష్ణ గంగూరి- కన్సల్టెంట్ డయాబెటీస్ & ఎండోక్రైనాలజి, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “ఈ రోగి 33 సంవత్సరాల వయసులో 124 కిలోగ్రాముల స్థూలకాయంతో, భారమైన శ్వాస, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళ సమస్యలతో పాటు వణకటం గత 8 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందుతో బాధపడటం మరియు వాటివల్ల రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఎంతో కష్టమైన పరిస్థితులలో మమ్మల్ని సంప్రదించారు. వారికి   ఆల్ట్రా సౌండ్ రిపోర్టులు, ఫైబ్రోస్కాన్, ట్రిపుల్ ఫేజ్ CECT వగైరా పరీక్షలు నిర్వహించి NAFLDగా నిర్దారించడం జరిగింది.
 
మేము డాక్టర్ల బృందం అయిన డా. టి.రవి శంకర్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజి, డా.సురేంద్ర జాస్తి- సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజి, డా.రేణు కుమార్ - లివర్ సర్జరీ మరియు ట్రాన్స్‌ప్లాంట్ మరియు డా.మురళీకృష్ణ గంగూరి- డయాబెటీస్&ఎండోక్రైనాలజి కలసి పేషంట్‌కి బేరియాట్రిక్ శస్త్ర చికిత్స అందించాలని నిర్ణయించారు.
 
డా.సురేంద్ర జాస్తి- సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజి, మణిపాల్ హాస్పిటల్-విజయవాడ వివరిస్తూ, “సిరోటిక్ కాలేయం నందు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స చేయటం అతి పెద్ద సవాలు. ఎందుకంటే శస్త్ర చికిత్స సమయంలో పెద్ద రక్త నాళాలు, ఎనస్థిషియా సందర్భంలో రక్తస్రావం లేదా సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. లివర్ బృందం యొక్క ప్రణాళికాబద్ధమైన మరియు అనుభవం కారణంగా దీనిని ఎంతో విజయవంతంగా నిర్వహించామన్నారు.
 
కనుక స్థూలకాయం మరియు అధిక శ్రేణి క్రొవ్వు కాలేయంలో కలిగి ఉన్నవారు ముందుగా సరైన పరీక్షలు నిర్ధారించుకోవడం మరియు అనుభవజ్ఞులైన డాక్టర్లను సంప్రదించడం మంచిదని ముఖ్యంగా స్థూలకాయ నివారణకు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స శాశ్వత పరిష్కార మార్గం“ అన్నారు.
 
సదస్సును ముగిస్తూ డా.సుధాకర్ కంటిపూడి-హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ వారు మాట్లాడుతూ, “చికిత్స అనంతరం రోగి డిశ్చార్జ్ చేయబడ్డారు. ప్రస్తుత అతను 34 కిలో గ్రాములు బరువు తగ్గి 90 కిలో గ్రాముల బరువు కలిగి వున్నాడు. ఇప్పుడు అతను వెన్ను నొప్పి మరియు మధుమేహ వ్యాధి (షుగర్) నుండి ఉపశమనం పొందాడు. అతని కాలేయం (లివర్) చక్కగా పనిచేస్తున్నది. రోగి ఎంతో సురక్షితంగా మరియు ఆరోగ్యకర స్థితిలో డిశ్చార్జ్ కావటానికి సకాలంలో చేపట్టిన వైద్య సేవలకు చూపిన శ్రద్ధకు డాక్టర్ల బృందాన్ని మరియు సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను“ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో ఆలివ్ ఆయిల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా?