Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సబ్బులు, ప్లాస్టిక్ డబ్బాలు, నెయిల్ పాలిష్‌లతో ఒబిసిటీ తప్పదట..! జర జాగ్రత్త!!

Advertiesment
Chemicals in soap
, శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (12:18 IST)
సబ్బుల్లో వాడే రసాయనాలు శరీరంలోని కొవ్వు నిల్వలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సోపులే కాదు గోళ్ళ రంగులతో కూడా జరజాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు, సబ్బులు, గోళ్ళ రంగులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తాజా అధ్యయనం తేల్చింది. ఆయా వస్తువుల్లోని రసాయనాలు ఒబిసిటీకి దారితీస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
 
ప్లాస్టిక్‌లో ఉండే థెల్లేట్‌ అనే రసాయనం వల్ల అనేక రోగాలు తప్పవు. తక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఇలాంటి రసాయనాల ప్రభావానికి లోనైతే ముప్పు తప్పదని... అనువంశికత, ఇతర కారణాలతోనూ స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియా పరిశోధకుడు లీ యెన్‌ వివరించారు. 
 
ప్రస్తుతం ఒబిసిటీ సమస్య చాలామందిని వేధిస్తుందని.. ఇందుకు నిత్యం వాడే వస్తువులే ప్రధాన కారణమని తెలిపారు. benzyl butyl phthalate (BBP) అనే రసాయనం నెయిల్ పాలిష్, ప్లాస్టిక్ డబ్బాలు, సబ్బుల్లో అత్యధికంగా ఉంటుందని.. ఈ రసాయనం కొవ్వు కణాలపై ప్రభావం చూపుతుందని.. తద్వారా ఒబిసిటీ తప్పదని లీ యెన్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu