Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రక్తం మనందరినీ కలుపుతుంది... ఎలాగంటారా...? ఇది చదవండి...

ప్రపంచంలో తొలిసారిగా రక్త గ్రూపులను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టెయినర్ జన్మదినమైన జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా జరుపుతుంటారు. ఈ ఏడాది ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చిన నినాదం “రక్తం మనందరిని కలుపుతుంది”. ప్ర

రక్తం మనందరినీ కలుపుతుంది... ఎలాగంటారా...? ఇది చదవండి...
, మంగళవారం, 14 జూన్ 2016 (16:49 IST)
ప్రపంచంలో తొలిసారిగా రక్త గ్రూపులను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టెయినర్ జన్మదినమైన జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా జరుపుతుంటారు. ఈ ఏడాది ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇచ్చిన నినాదం “రక్తం మనందరిని కలుపుతుంది”. ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రాణవాయ శస్త్రచికిత్స సమయంలోను, గర్భణిలకు విపత్తుల సమయంలోను జీవితాలను నిలిపేది రక్తమే. ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లలకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. 
 
సకాలంలో రక్తం అందక 10 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశ జనాభాలో ఒక శాతం మంది స్వచ్ఛందగా రక్తదానం చేసిన ఆరోగ్య అవసరాలకు సరిపోతుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 60 లక్షల యూనిట్ల పైన రక్తం అవసరమవుతుంది. 121 కోట్ల భారత జనాభాలో 6 లక్ష మంది మాత్రమే రక్తదాతలు ఉన్నారు. 
 
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా యువతలో 30 శాతం కంటే రక్తదాతలు లేరనేది వాస్తవం. రక్తం దానంపై సరియైన అవగాహన లేకపోవడం, మూఢ విశ్వాసాలు, కొన్నిచోట్ల జాతి, కుల, మత కట్టుబాట్లు రక్తదాతలను తయారు చేయలేకపోతున్నాయి. రక్తదానం వల్ల శరీరానికి కొత్త రక్తం వచ్చి దాతకు ఆరోగ్యం కలుగుతుందనే వాస్తవం పట్ల ప్రజలకు అవగాహన కలుగజేయడానికి రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మానవత్వం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు రక్తదాతగా సంవత్సరాని ఒకసారైన రక్తదానం చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రించే ముందు పుస్తకాన్ని చదివి పడుకుంటే ఏమవుతుంది...?