Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Dr Harjot Kaur Bajwa

ఐవీఆర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (22:42 IST)
హైదరాబాద్‌లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఏఓఐ), తీవ్రస్థాయి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 64 ఏళ్ల రోగికి విజయవంతంగా చికిత్స చేసింది. రేడియేషన్ ఆంకాలజిస్ట్, బ్రాకీథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా సంరక్షణలో, ఖచ్చితమైన, అంతర్గత రేడియేషన్ కోసం బ్రాకీథెరపీతో పాటు రేడియోథెరపీని రోగి పొందారు. ఈ చికిత్స సమగ్రమైన, లక్ష్య రేడియోథెరపీ విధానాన్ని అనుసరించింది, రోజువారీ ఆన్‌లైన్ అడాప్టివ్ రేడియోథెరపీని మిళితం చేసి, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీ థెరపీ కూడా అందించటం గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో మంచి ఫలితాలను చూపింది.
 
హైదరాబాద్ జిల్లాలోని మహిళల్లో ప్రబలంగా ఉన్న అన్ని రకాల క్యాన్సర్లలో 8.7 శాతం గర్భాశయ క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. 2024 ప్రారంభంలో, గర్భాశయ క్యాన్సర్ భారతదేశంలో మహిళలను ప్రభావితం చేస్తోన్న, అత్యంత ప్రబలంగా ఉన్న క్యాన్సర్‌లలో ఒకటిగా ఉంది, తెలంగాణలో అత్యధిక కేసులు నమోదయ్యాయి, ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ వంటి జిల్లాల్లో ఈ కేసులు కనిపిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ రెండవ అత్యంత సాధారణ రకం క్యాన్సర్ అయినప్పటికీ, చాలా మంది వైద్యులు దీని వ్యాప్తి రొమ్ము క్యాన్సర్‌తో సమానంగా ఉందని నివేదిస్తున్నారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో!
 
శ్రీమతి అరుణా శెట్టి (పేరు మార్చబడింది) సెప్టెంబరు 2023లో తీవ్రస్థాయి గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందింది. ఒక వైపు మూత్ర నాళాన్ని నిరోధించడం వల్ల మూత్ర విసర్జన ఆగిపోవటంతో పాటుగా హైడ్రో నెఫ్రోసిస్ ఏర్పడింది. ఆమె పరిస్థితి యొక్క సంక్లిష్టత దృష్ట్యా, ఏఓఐ యొక్క మల్టీడిసిప్లినరీ బృందం దుష్ప్రభావాలను తగ్గిస్తూనే క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికను రూపొందించింది. "రోజువారీ అడాప్టివ్ రేడియోథెరపీని ఉపయోగించడం వల్ల అవయవ కదలికలో వైవిధ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, కాలక్రమేణా కణితి కుచించుకు పోవటానికి అనుగుణంగా ప్రణాళిక చేయటానికి మాకు సహాయపడింది. బాహ్య రేడియేషన్ పూర్తయిన తర్వాత, ఎంఆర్ఐ  ఆధారిత ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి అవశేష కణితి నాశనం చేయబడింది. అత్యంత అధునాతన రేడియోథెరపీ, బ్రాకీథెరపీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల పూర్తి ప్రతిస్పందనను సాధించడానికి, రోగికి తక్కువ దుష్ప్రభావాలతో వ్యాధి నయం చేయడానికి మాకు సహాయపడింది. కణితి కుచించుకుపోయిన తర్వాత మూత్ర అవరోధం, హైడ్రోనెఫ్రోసిస్ సమస్యలు తగ్గాయి, ఫలితంగా రోగికి అద్భుతమైన జీవన నాణ్యత లభించింది" అని డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా చెప్పారు.
 
"ఏఓఐ వద్ద, మా రోగులకు సమర్థతను పెంచే, జీవన నాణ్యతను మెరుగుపరిచే అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని సిటీఎస్ఐ -దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది అన్నారు. "ఈ కేసు అధునాతన చికిత్సలను అందించడంలో మా అంకితభావాన్ని మరియు భారతదేశంలో సంక్లిష్ట క్యాన్సర్ కేసులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది" అని అన్నారు. చికిత్స ప్రక్రియలో ఖచ్చితమైన ప్రణాళిక మరియు రోగి సౌకర్య చర్యలు ఉన్నాయి. రోగి కి ఉన్న  క్యాన్సర్ స్థానాన్ని ఖచ్చితంగా మ్యాప్ చేయడానికి బహుళ ఇమేజింగ్ విధానాలకు అనుసరించారు  మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో, వైద్యులు రేడియేషన్‌ను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టుపక్కల ఉన్న కణజాలాలపై ప్రభావాన్ని తగ్గించారు.
 
రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి, ఈ చికిత్స అందించిన బృందంకు తన కృతజ్ఞతలు తెలుపుతూ, "ఇటువంటి సంక్లిష్ట చికిత్సలను సురక్షితంగా మరియు ప్రభావవంతంగా నిర్వహించగల ఏఓఐ సామర్థ్యం మా వైద్య సిబ్బంది యొక్క నైపుణ్యం మరియు కరుణను ప్రతిబింబిస్తుంది. మేము జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. మా రోగులు మరియు వారి కుటుంబాలు, అడుగడుగునా ఆశ మరియు మద్దతును అందిస్తాయి" అని అన్నారు. చికిత్సలో ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీ అని పిలువబడే ఒక ప్రత్యేక ప్రక్రియ కూడా ఉంది, ఇది అధిక-మోతాదు వినియోగం  ద్వారా ప్రభావిత ప్రాంతానికి నేరుగా రేడియేషన్‌ను పంపిణీ చేస్తుంది. బ్రాకీథెరపీ సమయంలో లక్ష్యాన్ని మ్యాప్ చేయడానికి ఎంఆర్ఐ  ఇమేజింగ్ ఉపయోగించడం కణితిలోని రేడియేషన్‌ను కేంద్రీకరించడానికి సహాయపడుతుంది, చికిత్స యొక్క ప్రభావాన్ని పెంచుతుంది.
 
"రోగి చికిత్సలో మా లక్ష్యం క్యాన్సర్‌ను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, ఆమె సౌకర్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా ఉంచడం" అని రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు బ్రాకీథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ హర్జోత్ కౌర్ బజ్వా అన్నారు. "ఈబిఆర్టి  మరియు బ్రాకీథెరపీ కలయిక గర్భాశయ క్యాన్సర్‌కు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఈబిఆర్టి  పెద్ద కణితి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటుంది, అయితే బ్రాకీథెరపీ నేరుగా గర్భాశయానికి కేంద్రీకృత మోతాదును అందిస్తుంది, చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది. ఈ ద్వంద్వ విధానం కణితి యొక్క నియంత్రణను మెరుగుపరుస్తుంది, మనుగడ రేటును పెంచుతుంది, పునరావృత ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా క్యాన్సర్  తీవ్రస్థాయికి చేరిన దశలలో" అని అన్నారు. రోగి యొక్క ప్రయాణం క్యాన్సర్ కేర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఏఓఐ యొక్క నిబద్ధతకు ఉదాహరణగా ఉంది, ఇది ప్రేమతో కూడిన , రోగి-మొదటి విధానం ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు