Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీజీ మెడికల్‌ ఆశావహుల కోసం సూపర్‌ యాప్‌ విడుదల చేసిన ALLEN

Advertiesment
Allen
, సోమవారం, 17 ఏప్రియల్ 2023 (23:32 IST)
భారతదేశవ్యాప్తంగా మెడికల్‌ కోచింగ్‌లో అగ్రగామి సంస్ధలలో ఒకటైన ALLEN, తమ ALLEN NExT App ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. NEET-PG, INI-CET మరియు FMGE పరీక్షల ప్రిపరేషన్‌ కోసం సమగ్రమైన పరిష్కారంగా పీజీ మెడికల్‌ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. ఈ యాప్‌ విస్తృత శ్రేణిలో వినూత్న ఫీచర్లను మరియు వనరులను అందిస్తుంది. ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర పరీక్షా ప్రిపరేషన్‌ ప్లాట్‌ఫామ్స్‌కు భిన్నంగా ఉంటుంది.
 
అమన్‌ మహేశ్వరి, హోల్‌ టైమ్‌ ఎగ్జిక్యూటివ్‌, ALLEN NExT Vertical  మాట్లాడుతూ, ‘‘ALLEN NExT యాప్‌‌తో మా లక్ష్యం ఏమిటంటే, వైద్య ప్రవేశ పరీక్ష సన్నద్ధత ప్రక్రియను సరళంగా, వారి హడావుడి షెడ్యూల్స్‌తో సంబంధం లేకుండా ఆ విద్యార్థులకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దడం. NEET-PG, INI-CET, FMGE పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించేలా సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అందించడం ద్వారా, పీజీ మెడికల్‌ విద్యార్ధులు తమ విద్య మరియు ప్రొఫెషనల్‌ లక్ష్యాలను అతి సులభంగా సాధించేలా తోడ్పడటం లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.
 
పీజీ మెడికల్‌ విద్యార్థుల జీవితం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని చెప్పడం కూడా తక్కువే. అస్సలు ఖాళీ లేని రీతిలో ఉండే వారి ఇంటెర్న్‌షిప్‌ షెడ్యూల్‌ను బ్యాలెన్స్‌ చేయడంతో పాటుగా పరీక్షలకు సిద్ధం కావడం చాలా కష్టమైన అంశం. అయితే ALLEN NExT యాప్‌ విడుదలతో పాటుగా దీని యొక్క సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు ఆల్ఫా, బీటా, మరియు డెల్టాతో వైద్య పీజీ విద్యార్ధులు పరీక్షలకు సిద్ధమయ్యే విధానం సమూలంగా మార్చనుంది.
 
బహుళ వనరులపై ఆధారపడాల్సిన ఆవశ్యకతను ఈ యాప్‌ తొలగించడంతో పాటుగా ప్రత్యేకమైన స్టార్‌ ఫ్యాకల్టీల నుంచి తాజా మరియు సంక్షిప్త విద్యావిషయాలను సైతం అందిస్తుంది. మూడు సమగ్రమైన కోర్సు ప్యాకేజీలు-ఆల్ఫా, బీటా మరియు డెల్టా-విద్యార్ధుల  వైవిధ్యమైన అవసరాలను తీర్చడంతో పాటుగా తమ ప్రిపరేషన్స్‌ కోసం అత్యుత్తమ వనరులను పొందేందుకు భరోసా అందిస్తుంది.
 
ఆల్ఫా కోర్సు: ఈ ప్యాకేజీ ఆఫ్‌లైన్‌ క్లాస్‌రూమ్‌ అభ్యాసం మరియు పునశ్చరణ (రివిజన్‌) సమ్మేళనంగా ఉంటుంది. దీనిలో 700 గంటల వీడియోలు, చక్కటి ర్యాంక్‌ పొందేందుకు తోడ్పడుతూ ఎక్స్‌ట్రా ఎడ్జ్‌, NExT-2 కోసం క్లీనికల్‌ స్కిల్‌ వీడియోలు, 200 గంటలకు పైగా ర్యాపిడ్‌ రివిజన్‌ వీడియోలు, గత సంవత్సరాల ప్రశ్నలను కవర్‌ చేస్తూ 10వేలకు పైగా క్వశ్చన్‌బ్యాంక్‌ మరియు క్లీనికల్‌ క్వశ్చన్స్‌‌తో పాటుగా 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ మైనర్‌ మరియు మేజర్‌ టెస్ట్‌లు, డిజిటల్‌ మరియు ప్రింటెడ్‌ నోట్స్‌ ఉంటాయి.
 
బీటా కోర్సు: ఈ ప్యాకేజీని ఆన్‌లైన్‌ అభ్యాసం మరియు రివిజన్‌ కోసం డిజైన్‌ చేశారు. దీనిలో ఆల్ఫా కోర్సు నుంచి రిసోర్శెలు అయిన 700 గంటల వీడియోలు ,  ఎక్స్‌ట్రా ఎడ్జ్‌ వీడియోలు, క్లీనికల్‌ స్కిల్‌ వీడియోలు, 200 గంటలకు పైగా ర్యాపిడ్‌ రివిజన్‌ వీడియోలు, 10వేలకు పైగా క్వశ్చన్‌లు మరియు 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ మైనర్‌ మరియు మేజర్‌ టెస్ట్‌లు, డిజిటల్‌ మరియు ప్రింటెడ్‌ నోట్స్‌ ఉంటాయి.
 
డెల్టా కోర్సు: ఈ ప్యాకేజీ అధికంగా 10వేలకు పైగా ప్రశ్నలు మరియు 200కు పైగా సబ్జెక్ట్‌ వైజ్‌ టెస్ట్‌లు మరియు మేజర్‌ టెస్ట్‌లపై దృష్టి సారిస్తుంది.
 
మెరుగైన అభ్యాసం కోసం అధిక ఫీచర్లు కలిగిన యాప్‌
రోజువారీ క్విజ్‌లు ద్వారా విద్యార్థులు తమ విజ్ఞానం మెరుగుపరుచుకునేందుకు దీనిని డిజైన్‌ చేశారు. నేపథ్యాలను వివరిస్తూ వీడియో విభాగాలు, తాజా న్యూస్‌ అప్‌డేట్స్‌, పరీక్షల సమాచారం, మరియు వీడియో బ్యాంక్‌ వంటివి దీనిలో ఉంటాయి.  ఈ కాన్సెప్ట్స్‌ను NEET-PG, INI-CET, FMGE మరియు  NExT లో పరీక్షించారు. ఇంగ్లీష్‌ మరియు హింగ్లీష్‌లో  700 గంటలకు పైగా కంటెంట్‌  లభ్యమవుతుంది. ఈ యాప్‌లో బోధనను అనుభవజ్ఞులైన, ప్రత్యేకమైన స్టార్‌ ఫ్యాకల్టీ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుగంధ కోకిల నూనెతో ప్రయోజనాలు, ఏంటవి?