Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పురుషులు ఆ ఇంజెక్షన్లు వేయించుకుంటే.. హాయిగా శృంగారంలో పాల్గొనవచ్చు..

అవాంఛిత గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్‌ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇకమీదట అవాంఛిత గర్భం నిరోధించేందుకు కండోమ్స్‌ వాడనవసరం లేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే గర్

Advertiesment
hormone injection
, శనివారం, 29 అక్టోబరు 2016 (12:33 IST)
అవాంఛిత గర్భాలను నివారించేందుకు, వివిధ సుఖ వ్యాధులనుంచీ దూరంగా ఉండేందుకు కండోమ్‌ను చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇకమీదట అవాంఛిత గర్భం నిరోధించేందుకు కండోమ్స్‌ వాడనవసరం లేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే... మగవారు ఇందుకోసం ఎనిమిది వారాలకోసారి.. రెండు హార్మోన్‌ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలు.. గర్భం వస్తుందన్న భయం లేకుండా.. శృంగారంలో పాల్గొనవచ్చు. 
 
హార్మోన్‌ ఇంజక్షన్లతో మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ (శుక్రకణాల సంఖ్య)ను తగ్గిపోయేలా చేయవచ్చని ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాస్త్రవేత్త మన్మోహన్‌ మిస్రోతో కూడిన అంతర్జాతీయ బృందం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియో ఫిలిప్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి మిస్రో చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. సుమారుగా 96 శాతం ఈ ఇంజెక్షన్లు పనిచేశాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే వీటివల్ల కూడా కండరాల నొప్పి, మొటిమలు వంటి పలు దుష్ప్రభావాలు రావడంతో వాటిని నివారించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షయకు ఒకే మందు అవిశాకు...