Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్‌ ఫోన్లలో రేడియేషన్ తెలుసుకునేదెలా.... అక్కడ సెల్ ఫోన్లు అస్సలు వాడకూడదు...

సెల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ మనకు హాని కలిగిస్తుంది. సెల్‌ఫోన్లు వినియోగంలో వచ్చినప్పటి నుంచి సైంటిస్టులు మనకు చెబుతూ ఉన్నారు. రేడియేషన్ ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.. ఎస్‌ఐఆర్ వాల్యుని బట్టి దాని రేడియేషన్ అంచనా వుంటుంది. ఆండ్రాయిడ్ ఫోనును

సెల్‌ ఫోన్లలో రేడియేషన్ తెలుసుకునేదెలా.... అక్కడ సెల్ ఫోన్లు అస్సలు వాడకూడదు...
, శనివారం, 24 జూన్ 2017 (13:58 IST)
సెల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ మనకు హాని కలిగిస్తుంది. సెల్‌ఫోన్లు వినియోగంలో వచ్చినప్పటి నుంచి సైంటిస్టులు మనకు చెబుతూ ఉన్నారు. రేడియేషన్ ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.. ఎస్‌ఐఆర్ వాల్యుని బట్టి దాని రేడియేషన్ అంచనా వుంటుంది. ఆండ్రాయిడ్ ఫోనును మీరు వాడుకుంటే అందులో *#07# ను డయల్ చేయాలి. ఇలా చేస్తే ఎస్ఐఆర్ వేల్యు తెలిసిపోతుంది. మనదేశంలో లభించే ఫోన్లో ఎస్ఐఆర్ వేల్యు కేజీకి 1.06 వాట్లు అంటే అంతకన్నా తక్కువగా ఉండాలి. ఇలా ఉంటే శరీరానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
 
అయితే అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రం ఆరోగ్యానికి హాని తప్పదంటున్నారు వైద్యులు. అంతేకాదు ప్రతి కాల్‌ను రెండు నిమిషాలకు మించి ఎక్కువసేపు మాట్లాడకూడదట. పెద్దలపై కన్నా పిల్లల మీదే రేడియేషన్ ప్రభావం ఎక్కువట. ప్రయాణంలో తప్ప మిగిలిన సమయాల్లో సెల్‌ ఫోన్‌ను శరీరానికి దూరంగా ఉంచడం ఎంతో మంచిది. 
 
డెస్క్ జాబ్‌లు చేసేవాళ్ళయితే ఫోన్లను జేబులో కాకుండా డెస్క్‌లో పెట్టుకోవాలి. లిఫ్టులలో ఫోన్లను అస్సలు వాడకూడదు. లిఫ్టులలో రేడియేషన్ ప్రభావం రెట్టింపుగా ఉంటుంది. రేడియేషన్ ఎక్కువైతే క్యాన్సర్.. శ్వాసకోస వ్యాధులు తప్పవట. మెదడు పనితీరులోను గణనీయమైన మార్పు వస్తుందట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బానపొట్టను తగ్గించుకోవడం ఎలా?