కాలేయ పనితీరును చెడగొట్టే ఆహారపదార్థాలేంటి?
శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. శరీరంలో ఉండే పెద్ద అవయవం కూడా. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో
శరీరంలోని అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. శరీరంలో ఉండే పెద్ద అవయవం కూడా. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటికి వెళ్లాలన్నా లివర్ ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనం తింటున్న అనేక ఆహార పదార్థాలు లివర్ చెడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పటివరకు మద్యపానం, ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు. కానీ వాటితోపాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాలేంటో ఓసారి పరిశీలిద్ధాం.
శీతల పానీయం సేవించే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వీటివల్ల కాలేయం త్వరగా చెడి పోతుందట. అలాగే, కూల్ డ్రింక్స్‌లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయని వైద్యులు చెపుతున్నారు.
చక్కెర లేదా తీపి పదార్థాలను అధికంగా ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది. చక్కెరను అతిగా తింటే అది శరీరానికి ఉపయోగం కాదుకదా, అది మొత్తం లివర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీనివల్ల లివర్ పనితీరు మందగిస్తుంది.
విటమిన్ 'ఎ' ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ సమస్యలు ఉండవని అందరికీ తెలిసిందే. అయితే ఈ విటమిన్ శరీరంలో మోతాదుకు మించినా దాని ప్రభావం లివర్‌పై పడుతుందట. దీంతో లివర్ ఆరోగ్యం నాశనమవుతుందట.
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. చిప్స్ వంటి చిరుతిండ్లలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెపుతున్నారు.