Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనారోగ్యంతా మనుషులు ఎందుకు చనిపోతున్నారో తెలుసా..?

ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఆరోగ్యం సహకరించందే ఏమీ సాధించలేడు. అలాంటి విలువైన ఆరోగ్యాన్ని ప్రస్తుత కాలంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్లే ఎన్నో కొత్తకొత్త వ్యాధులు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అయితే పెరిగిన టెక్నాలజ

Advertiesment
world health day
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (20:21 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఆరోగ్యం సహకరించందే ఏమీ సాధించలేడు. అలాంటి విలువైన ఆరోగ్యాన్ని ప్రస్తుత కాలంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్లే ఎన్నో కొత్తకొత్త వ్యాధులు సంభవిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అయితే పెరిగిన టెక్నాలజీని అందిపుచ్చుకుని వాటికి తగిన విధమైన మందులు తయారుచేస్తున్నప్పటికీ కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉరుకుల, పరుగుల జీవితంలో చాలామంది ఈ మధ్యకాలంలో విపరీతమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడి పోయామన్న  భావన చాలామందిలో కలుగుతోంది. అందుకే ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంధర్భంగా మనషుల్లో ఏర్పడుతున్న కుంగుబాటుతనంపై అవగాహన కల్పించే ప్రయత్నం అధికారులు వైద్యాధికారులు.
 
జీవితం చాలా విలువైనది. ఆ జీవితమనే వాహనానికి ఇంధనం లాంటిదే ఆరోగ్యం. ఆరోగ్యం సహకరించకపోతే ఎవరూ ఏమీ సాధించలేరు. సాధించినా దానిని అనుభవించలేరు. కాబట్టి ఎన్ని వ్యాపకాలు, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆరోగ్యం పట్ల మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదన్నదే అందరూ చెబుతున్న మాట. అయితే యాంత్రిక జీవనంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే. ఈ వేగంలో ఆరోగ్యాన్ని కాస్త నిర్లక్ష్యం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఆహార అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్థేశిస్తాయి. తీసుకునే ఆహారం 70శాతంకుపైగా కలుషితమవుతున్న ఈ నేపథ్యంలో రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. 
 
విపరీతమైన మానసిక ఒత్తిడి లోనవుతున్నారు ప్రజలు. కార్యాలయాల్లో బాస్ తిట్టాడనో, మార్కులు తక్కువచ్చాయని నాన్న అరిచాడనో, పెళ్ళికి ఒప్పుకోమంటూ తల్లి కూతురిపై ఒత్తిడి తెచ్చిందనో, ప్రేమించిన వాడు మోసం చేశాడనో కారణాలు ఏవైనా కావచ్చు. మనిషి, మెదడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న మాట వాస్తవమే. అందుకే ఈసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సంధర్భంగా మనుషులలో పెరుగుతున్న ఈ డిప్రెషన్ తగ్గించడం ఎలా అన్న అంశంపైనే దృష్టి సారించింది వైద్య, ఆరోగ్య శాఖ. అందుకు కారణాలను అన్వేషించడంతో పాటు ఆ డిప్రెషన్ నుంచి బయట పడడం కోసం ఏమేం చేయాలన్న విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
అసలు మనిషిలో ఇంతగా డిప్రెషన్ కలగడానికి కారణాలేంటి..? పనిలో వస్తున్న ఇబ్బందులా.. మారుతున్న జీవన విధానమా..లేకుంటే దెబ్బతిన్న మన ఆహారపు అలవాట్లా. ఇవన్నీ కూడా ఒక రకంగా కారణమే అంటున్నారు తిరుపతిలోని ప్రముఖ వైద్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవి కాలం... పెర్‌ఫ్యూమ్స్ ఎలా వాడాలి?