Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్య సందేశంగా మారిన ‘Depression: Let’s Talk’: ఒత్తిడితో కుంగిపోకుండా.. ప్రేమతో?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్7) నేడే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ప్రస్తుతం 300 మిలియన్ల మంది ఒత్తిడితో బాధపడుతున్నారని.. అందుకే ఈ ఏడాది డిప్రెషన్.. లెట్స్ టాక్ అనే నినాదాన

Advertiesment
World Health Day 2017
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (11:31 IST)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్7) నేడే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ప్రస్తుతం 300 మిలియన్ల మంది ఒత్తిడితో బాధపడుతున్నారని.. అందుకే ఈ ఏడాది డిప్రెషన్.. లెట్స్ టాక్ అనే నినాదాన్ని చేపట్టారు. 2017 ఏడాది నినాదంగా డిప్రెషన్.. లెట్స్ టాక్‌ను మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఒత్తిడితో కుంగిపోతున్న యువతను చైతన్యవంతుల్ని చేయాలని నిర్ణయించుకుంది. 
 
కుంగిపోతున్న యువతను చైతన్యవంతుల్ని చేసే దిశగా.. నిరాశ, నిస్పృహలను తరిమేయాలని.. ఆశావాదంతో ఒత్తిడి నుంచి బయటపడాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే నవ్వుతూ పలకరించడం.. ప్రేమగా మాట్లాడటం, ఆత్మీయతను పంచడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. మారుతున్న జీవన పరిస్థితుల్లో తోటివారితో ప్రేమగా మాట్లాడటమే ఆరోగ్య సందేశంగా మారిపోయింది.
 
దీనిపై డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్-జనరల్, డాక్టర్ మార్హరెట్ చాన్ మాట్లాడుతూ.. భారత దేశంలో ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుందని.. అందుకే మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఒత్తిడిని అధిగమించాలంటే మౌలికసదుపాయాలు తప్పకుండా ఉండాలని మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని సూచించారు. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస సౌకర్యాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయాలని సూచించారు. భారత్‌లోనే కాకుండా ఆగ్నేయ ఆసియాలో 86 మిలియన్ల మంది ప్రజలు ఒత్తిడితో బాధపడుతున్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుచ్చకాయ రసంతో తలనొప్పి మాయం.. ఇలా చేయండి?