Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం 2021: గుప్పెడు బాదములతో మధుమేహాన్ని అదుపు చేయవచ్చు

Advertiesment
అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం 2021: గుప్పెడు బాదములతో మధుమేహాన్ని అదుపు చేయవచ్చు
, శుక్రవారం, 12 నవంబరు 2021 (20:59 IST)
ప్రపంచవ్యాప్తంగా మధుమేహ దినోత్సవాన్ని మధుమేహం పట్ల అవగాహన కల్పించే లక్ష్యంతో నవంబర్‌ 14వ తేదీన జరుపుతుంటారు.  భారతదేశ వ్యాప్తంగా 72 మిలియన్‌ల మందిపై మధుమేహం ప్రభావం చూపుతుంది. దేశంలో అతి సాధారణంగా కనిపిస్తున్న వ్యాధులలో ఒకటిగా ఇది నిలుస్తుంది. అంతర్జాతీయ డయాబెటీస్‌ ఫెడరేషన్‌ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 463 మిలియన్ల మంది పెద్దలు మధుమేహంతో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 700 మిలియన్లకు పెరగవచ్చని అంచనా. ప్రతి ఇద్దరిలోఒకరు మధుమేహ బాధితులు కావడంతో పాటుగా చాలామందికి ఆ సమస్య తమకు ఉన్నట్లు కూడా తెలియదు. మరో 374 మిలియన్ల మందిలో ప్రతి 13 మందిలో ఒకరు ప్రీ డయాబెటిస్‌ స్ధితిలో ఉంటారు.
 
అధ్యయనాలు వెల్లడించే దానిప్రకారం జీవనశైలి మార్పులు అంటే శారీరక వ్యాయామాలు జీవితంలో భాగం చేసుకోవడం, అధిక బరువు తగ్గించుకోవడం, అతి ముఖ్యమైన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా టైప్‌ 2 మధుమేహం నిర్వహించుకోవడం సాధ్యం కావడం మాత్రమే కాదు, ఈ మధుమేహ బారిన పడే వారు సైతం టైప్‌ 2 మధుమేహం బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గించుకోవచ్చు. 
 
అలాగే మందులు వాడటంతో పోలిస్తే సుదీర్ఘకాల ప్రభావమూ ఇవి చూపుతాయి. అవగాహన పెంచడం కోసం ప్రపంచమంతా ఏకం అవుతున్న వేళ, 2021-23 సంవత్సరాల కోసం ప్రపంచ మధుమేహ దినోత్సవ నేపథ్యంగా మధుమేహ సంరక్షణ ప్రాప్యత నిలుస్తుంది. ఇన్సులిన్‌ను కనుగొని 100 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా లక్షలాది మంది మదుమేహులు ఇప్పటికీ ఈ వ్యాధి నిర్వహణకు అవసరమైన రక్షణను పొందలేకపోతున్నారు. జీవనశైలి వ్యాధిగా, మదుమేహంతో బాధపడే ప్రజలకు నిరంతర సంరక్షణ, మద్దతు కావాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్‌ సమస్యలను నిరోధించవచ్చు.
 
దశాబ్దాల నాటి నిరూపణలు బాదములు, ఇతర గింజ పదార్థాలు అందిస్తున్న మద్దతును వెల్లడిస్తున్నాయి. టైప్‌ 2 మధుమేహం లేదా ప్రీ డయాబెటీస్‌ రోగులకు ఇవి ప్రయోజనకారిగా ఉంటుంది. డైటరీ, జీవనశైలి జోక్యాలు ఈ మధుమేహ చికిత్సలో అత్యంత కీలకం కావడంతో పాటుగా బాదముల యొక్క న్యూట్రిషన్‌ ప్రొఫైల్‌ తీర్చిదిద్దడంలో కూడా కీలకంగా ఉంటాయి. అతి తక్కువ గ్లిసెమిక్‌ ఇండెక్స్‌ ఆహారం మరియు శక్తివంతమైన న్యూట్రియంట్‌ ప్యాకేజీలో ప్లాంట్‌ ప్రోటీన్‌, డైటరీ ఫైబర్‌, చక్కటి కొవ్వు, అతి ముఖ్యమైన విటమిన్స్‌ మరియు మినరల్స్‌ అయినటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి టైప్‌ 2 లేదా ప్రీ డయాబెటీస్‌ రోగులకు స్మార్ట్‌ స్నాక్‌గా బాదములను నిలుపుతాయి.
 
సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘పలువురు యువ, వయసు మళ్లిన భారతీయులు టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య స్ధిరంగా పెరుగుతుంది. ప్రపంచ మధుమేహ రాజధానిగా ఇండియా నిలుస్తుంది. మన జీవనశైలి ఎంపికలే ఈ వ్యాధి బారిన పడేందుకు కారణమవుతుందని మనందరికీ తెలుసు. అయితే మనల్ని మనం కాపాడుకోవడానికి మనం చేయాల్సినంతగా చేయడం లేదు. మధుమేహం చుట్టూ మనం అవగాహన పెంచుకుంటున్న వేళ, మొదటి అడుగుగా మనతో పాటుగా మన కుటుంబ ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. మరింతగా ఆకుకూరలు తీసుకోవడంతో పాటుగా ప్రాసెస్డ్‌ షుగర్‌ను తగ్గించుకోవడం లేదా మొత్తానికి నిరోధించడం చేయాలి. దీనితో పాటుగా ఓ గుప్పెడు బాదములను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదములతో బ్లడ్‌ షుగర్‌ తగ్గించుకోవడం సాధ్యపడుతుంది’’ అని అన్నారు.
 
ఫిట్‌నెస్‌ మరియు సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘ఎన్నో ఆధునిక అనారోగ్యాల్లాగానే మధుమేహం, ఓ జీవనశైలి వ్యాధి. రోజువారీ జీవితంలో వ్యాయామాలు జోడించుకోవడం ద్వారా దీనిని ఓవిధంగా అత్యుత్తమంగా నిర్వహించవచ్చు. అది రన్నింగ్‌, పిలాట్స్‌, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ లేదా ఏరోబిక్స్‌ ఏదైనా కావొచ్చు. నిలకడ మరియు క్రమశిక్షణ అత్యంత కీలకం. ప్రతి రోజూ ఓ 30 నిమిషాలు తీసుకోవడంతో పాటుగా వ్యామామాలకు కేటాయించాలి. అదనంగా, మీ వ్యాయామాలతో పాటుగా స్నాకింగ్‌ను ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. అనారోగ్యకరమైన, వేయించిన, కేలరీలు అధికంగా కలిగిన స్నాక్స్‌కు బదులుగా రోస్టెడ్‌, సాల్టెడ్‌ లేదా  ముడి బాదములు తీసుకోవడం మంచిది. ఇవి పోషకాలతో కూడి ఉండటంతో పాటుగా మధుమేహులకు అనుకూలంగా ఉంటుంది. బాదములతో తగినశక్తినీ పొందగలరు. వర్కవుట్‌ ముందు మరియు తరువాత కూడా తీసుకునేందుకు అత్యుత్తమ స్నాక్‌గా ఇది నిలుస్తుంది’’అని అన్నారు.
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌, షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘టైప్‌ 2 మధుమేహంతో జీవించడానికి జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మధుమేహం బారిన పడిన వ్యక్తులు తమ రోజువారీ కార్యక్రమాల పరంగా పలు మార్పులను చేసుకోవడంతో పాటుగా తమ బ్లడ్‌ షుగర్‌ స్థాయిలను నియంత్రించుకుంటూనే, తమ మధుమేహ లక్షణాలనూ నియంత్రించాల్సి ఉంటుంది.  వీటితో పాటుగా మధుమేహులలో కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 
అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా టైప్‌ 2 మధుమేహులలో  సీవీడీ ప్రమాదాన్ని తగ్గించుకోగలరు. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ బాదములను తీసుకోవడంతో పాటుగా తమ ఆరోగ్యవంతమైన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ నిర్వహించడంతో పాటుగా  బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోగలరు. గుండె జబ్బులు పెరిగేందుకు అతి ముఖ్యమైనకారణాలలో ఒకటిగా ఈ బెల్లీ ఫ్యాట్‌ నిలుస్తుంది’’ అని అన్నారు.
 
ఈ అంతర్జాతీయ మధుమేహ దినోత్సవ వేళ, మీ కుటుంబ జీవనశైలి ప్రాధాన్యతలను పునఃసమీక్షించడంతో పాటుగా ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించేందుకు, సంతోషకరమైన జీవితం గడిపేందుకు తగిన ప్రయత్నాలను చేయడం ఆరంభించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే?