Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడిగుడ్డు ఎందుకు తినాలి? ఈ 6 పాయింట్లు చూస్తే...

కోడిగుడ్డు ఎందుకు తినాలి? ఈ 6 పాయింట్లు చూస్తే...
, శనివారం, 9 ఫిబ్రవరి 2019 (20:59 IST)
కోడిగుడ్డు మన ఆరోగ్యానికి మంచిది అనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం, ఉడికించిన గుడ్డులో 6.29 గ్రాముల ప్రోటీన్స్ మరియు 78 క్యాలరీలు కలిగి ఉంటాయి. 
 
ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావల్సినంత ఎనర్జీ అందుతుంది. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. ఇది కండపుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు తేలికగా జీర్ణము కాదు గనుక తొందరగా ఆకలివేయదు. గుడ్డు తీసుకోనడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.  
 
1. కోడిగుడ్డు తింటే కంటికి ఎంతో మేలు కలుగుతుంది. రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసొనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి. 
 
2. గుడ్లలో విటమిన్‌ డి పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముక జబ్బుల వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం మంచిది.
 
3. ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. గుడ్డులోని పచ్చసొన పిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఆరోగ్యకరం.
 
4. మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయ జబ్బు, ధమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ఎగ్ వైట్ వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం వీటి నుండి పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి మరియు ఓస్టియోపొరోసిస్‌ను దూరంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
 
5. ఉదయాన్నే గుడ్డు తింటే రక్తంలో మంచి కొవ్వు అయిన హెచ్‌డీఎల్‌ స్థాయిలు మెరుగుపడతాయి. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తాయి. ఇవి రెండూ గుండె ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.
 
6. గుడ్డు పచ్చసొన వలన శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది. ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, గోళ్ళు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలకు ఆప్రికాట్స్ జ్యూస్‌తో తేనెను మిక్స్ చేసి ఇస్తే?