Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమ్మర్‌లో బరువు పెరిగే అవకాశాలే ఎక్కువట.. వ్యాయామాలు మానేయకండి!

Advertiesment
Summer
, గురువారం, 12 మే 2016 (15:19 IST)
సమ్మర్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది విహార యాత్రలు, స్విమ్మింగ్ ఇలా రకరకాలు. సహజంగానే వేసవిలో ఇవన్నిచేయడం వల్ల బరువు తగ్గొచ్చని అందరూ అనుకుంటారు. కాని నిజానికి సమ్మర్‌లో బరువు పెరిగే అవకాశాలే చాలా ఎక్కువ. దీంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్మర్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయని మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాము. ఒకవేళ వెళ్ళినా కూడా ఎండలో తిరిగే యాక్టివిటీస్ ఏమి లేకుండా చూసుకుంటాము. దీనివల్ల బరువు పెరుగుతుంది. ఇకపోతే చాలా వరకు సమ్మర్‌లో జ్యూస్‌లు, ఐస్ క్రీంలు, ఇంకా ఇతర ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాము. వీటి వల్ల బరువు పెరిగే అవకాశాలు లేకపోలేదు. 
 
అయితే సమ్మర్ లో బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...
* సమ్మర్‌లో స్విమ్మింగ్, జిమ్, యోగా వంటి వాటికి వెళ్లాలి. ఇవి వేసవిలో బరువు పెరగడాన్నినియంత్రిస్తాయి.
* ఎండగా ఉంది కదా అని రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలు మానేయకూడదు. ప్రొద్దున కాకపోతే సాయంత్రాలు వ్యాయామాలు చేసుకోవచ్చు. 
* సమ్మర్‌లో వాతావరణం వేడిగా ఉండడం వల్ల కొంచెం బద్దకంగా ఉండడం సహజమే. లేట్‌గా నిద్ర లేవడం, రోజంతా బద్దకించి కూర్చోవడం, ఏ పనులు చేయకపోవడం వల్ల శరీరం క్రమంగా బరువెక్కుతుంది. కాబట్టి అన్నిపనులను సరైనా వేళలో చేయాలి.
* వేసవిలో తీసుకొనే ఆహారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. వేసవిలో జీవక్రియలను వేగవంతం చేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమ్మర్ టిప్స్ : మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే..?