యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా,ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే యోగా డే ముఖ్య ఉద్దేశం.
అయితే.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? అసలు.. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు మొదలయ్యింది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. యుజ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం అన్నమాట.
అందుకే.. ఆ పదాన్ని తీసుకున్నారు. యోగా ఇప్పటిదేమీ కాదు.. దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగాకు సంబంధించిన యోగశాస్ర్తాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే.
అందుకే.. యోగాను ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం ప్రతి సంవత్సరం యోగాడేను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో యోగా డేను నిర్వహిస్తారు.