Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేక్ ఫాస్ట్ మానేశారో గోవిందా.. బ్రేక్ ఫాస్ట్‌ తీసుకుంటే స్వీట్లు నచ్చవట...

ఊబకాయ సమస్యను దూరం చేసుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మరిచిపోకూడదని వైద్యులు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే.. ఊబకాయం తప్పదని.. బ్రేక్ ఫాస్ట్ మానడం ద్వారా సన్నబడటం కాదు కానీ ఒబిసిటీ తప్పదని వైద

Advertiesment
breakfast
, బుధవారం, 10 ఆగస్టు 2016 (13:12 IST)
ఊబకాయ సమస్యను దూరం చేసుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మరిచిపోకూడదని వైద్యులు చెప్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తినకపోతే.. ఊబకాయం తప్పదని.. బ్రేక్ ఫాస్ట్ మానడం ద్వారా సన్నబడటం కాదు కానీ ఒబిసిటీ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రొటీన్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువ అవుతుందని.. తద్వారా లంచ్, డిన్నర్లలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇలా ఎక్కువ తినడం వల్ల ఊబకాయం పాలబడే ప్రమాదం ఉందన్నారు. 
 
ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌ తినని రోజున స్వీట్లు కూడా బాగా తింటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అదే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్న వారిలో స్వీట్లు తీసుకోవడంలో ఆసక్తి చూపట్లేదని తేలింది. ఇంకా పోషకవిలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోవడం వల్ల ఫుడ్‌ క్రేవింగ్‌ కూడా ఉండదట. ఈ స్టడీలో భాగంగా రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లు, అవి శరీరంపై చూపే ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పోషకవిలువలు కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ను తింటే మంచిదని తేల్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వుల నూనె... మాడుపై అంటితే... శరీరానికి రాసి మర్దన చేస్తే... ఇంకా ఎన్నెన్నో...