Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపరేషన్ సమయంలో వైద్యులు ఆకుపచ్చ రంగునే ఎందుకు ధరిస్తారు?

Advertiesment
operation
, బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (11:58 IST)
మనలో చాలా మంది జీవితంలో ఒక్కసారైనా ఏదో ఒక కారణంతో ఆసుపత్రికి వెళ్లి ఉంటారు. శస్త్రచికిత్సకు ముందు, వైద్యులు ఆకుపచ్చ రంగు దుస్తులలో సిద్ధంగా ఉండటం మీరు చూసి ఉండాలి. ఆపరేషన్ సమయంలో ఆకుపచ్చ రంగు దుస్తులనే వైద్యులు ఎందుకు ధరిస్తారు. ఇతర రంగు దుస్తులు ఎందుకు ధరించరు? గ్రీన్ డెర్స్ ధరించడం వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
 
సాధారణంగా వెలుతురు ప్రదేశం నుంచి చీకటి గదిలోకి ప్రవేశించినప్పుడు, ఆకుపచ్చ లేదా నీలం దుస్తులతో మీరు మంచి అనుభూతి చెందుతారని మీరు గమనించాలి. పైగా, ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులు ధరించడం వల్ల వైద్యుడి చూసే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఎరుపు రంగును మరింత సున్నితంగా చేస్తుందట. ఇలా ఆకుపచ్చ వస్త్రం ఆపరేషన్ సమయంలో కళ్ళకు కాస్త ఉపశమనం కలిగించేలా చేస్తుందట. 
 
అయితే, ఇటీవలి కాలంలో చాలా చోట్ల ఆపరేషన్ల సమయంలో వైద్యులు నీలం లేదా తెలుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. కానీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తేనే ఎంతో మంచిదట. రక్తపు మరకలు గోధుమరంగంలో కనిపిస్తాయిట. గతంలో తెల్లని దుస్తులు ధరించే సాంప్రదాయం ఉండేది. 
 
ఇక ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించే సాంప్రదాయం మొదటి నుంచి లేదట. మొదటి నుంచి వైద్యులు తెలుపు రంగు దుస్తులు ధరిస్తూ ఉండగా.. 1914 తర్వాత వైద్యులు తెలుపు రంగును ఆకుపచ్చ రంగుగా మార్చారట. ఇక అప్పటినుంచి వైద్యులందరికీ కూడా ఆకుపచ్చ దుస్తువులు ధరించడం అనేది డ్రెస్ కోడ్‌గా మారిపోయింది అని చెప్పాలి.
 
టుడేస్ సర్జికల్ నర్స్ యొక్క 1998 ఎడిషన్‌లో ఇటీవల ఒక నివేదిక ప్రచురితమైంది. ఈ నివేదిక ప్రకారం ఆకుపచ్చ వస్త్రం శస్త్రచికిత్స సమయంలో కంటికి కొంత విశ్రాంతిని కలిగిస్తుందట. ప్రపంచంలోనే మొట్టమొదటి సర్జన్‌గా పరిగణించే వైద్యుడు, ఢిల్లీలోని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ నైన్ ఆపరేషన్ సమయంలో ఆకుపచ్చ రంగును ఉపయోగించడం గురించి రాశారు.
 
దీనికి స్పష్టమైన వివరణ లేదు. శస్త్రచికిత్స సమయంలో, వైద్యులు తరచుగా నీలం మరియు తెలుపు యూనిఫాంలను కూడా ధరిస్తారు. కానీ రక్తపు మచ్చలు దానిపై గోధుమ రంగులో కనిపిస్తాయి కాబట్టి, ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వైద్యులు చాలా కాలం పాటు నీలం లేదా ఆకుపచ్చ యూనిఫాం ధరించారు.
 
గతంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అంతా తెల్లటి యూనిఫాం ధరించేవారు. కానీ ఒక వైద్యుడు 1914లో దానిని ఆకుపచ్చ రంగులోకి మార్చారు. అప్పటి నుండి, ఈ డ్రెస్సింగ్ చాలా ప్రజాదరణ పొందింది. ఈ రోజుల్లో, కొంతమంది వైద్యులు కూడా నీలం రంగు దుస్తులనే అధికంగా ధరిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వివాహ సీజన్‌లో మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి చిట్కాలు