పని ఒత్తిడి. ఇప్పుడు చేసే ప్రతి పనిలోనూ చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటివారు కనీసం నెలకి ఒకసారైనా శరీరానికి మసాజ్ చేయించుకుంటుంటే కొత్త శక్తి, నూతన ఉత్సాహం సొంతమవుతుంది. నెలకోసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.
మసాజ్ కండరాలను బలపరుస్తుంది. మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మసాజ్ ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మసాజ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మసాజ్ చేయడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది. మసాజ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. ప్రశాంత నిద్రకు బాటలు వేస్తుంది. మసాజ్ దృష్టిని ప్రకాశవంతం చేస్తుంది. మసాజ్ శృంగార జీవితానికి కూడా మేలు చేస్తుంది.