ఛ... ప్లాస్టిక్ డబ్బాలు, పాత్రల్లోనా తినేది...? రాగి, ఇత్తడి పాత్రలతో మేలెంతో...
ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందకరమైన జీవనానికి మన సంప్రదాయాల్లోని కొన్ని విషయాలు చాలా దోహదం చేస్తాయి. అటువంటిదే రాగి పాత్రల వాడకం. ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి లేదా వెండి పాత్రలు వాడటం అలవాటు. ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే ఆ లోహాలను పూజార్
ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందకరమైన జీవనానికి మన సంప్రదాయాల్లోని కొన్ని విషయాలు చాలా దోహదం చేస్తాయి. అటువంటిదే రాగి పాత్రల వాడకం. ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి లేదా వెండి పాత్రలు వాడటం అలవాటు. ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే ఆ లోహాలను పూజార్హం చేశాయి.
అంతేనా.. ఒక్కసారి తాతముత్తాతల కాలంలోకి రీవైండ్ అయితే.. రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, కొండొకచో కంచు సామగ్రి చూడొచ్చు. వీటన్నింటిలోనూ రాగి ఉంటుంది. ఈ రాగికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? మన జీవితంలో ఒక భాగమైపోవడంలో ఈ లోహానికున్న లక్షణాలేంటి? అని ఆధునిక పరిశోధకులు తరచి చూస్తే.. బోలెడన్ని మంచి విషయాలు ఈ లోహం గురించి బయటపడ్డాయి.
అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ర్టేషన్ అయితే.. రాగిని శరీరానికి అవసరమైన ‘ట్రేస్ ఎలిమెంట్’గా గుర్తించడమే కాక, అది లోపిస్తే ఏమిటి.. ఎక్కువైతే ఏమవుతుందో కూడా చేసిన పరిశోధనలకు గుర్తింపునిచ్చింది. ఈ పరిశోధనల ద్వారా రాగి వాడకంతో ఆధునిక కాలంలో వచ్చే చాలా జబ్బులను అరికట్టొచ్చని తేలింది.
రాగి ప్రయోజనాల్లో ముఖ్యమైన 12 గుణాలు.....
1. ఎసిడిటీని తగ్గించడం
2. అల్సర్లతోపాటు అజీర్ణాన్ని అరికట్టడం
3. అధిక బరువును తగ్గించడం
4. గుండెజబ్బును నివారించడం
5. కేన్సర్ నిరోధక సామర్థ్యం
6. డయేరియా దరి చేరకుండా చేయడం
7. కామెర్లు రాకుండా చూడడం
8. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయనీయకుండా చేయడం
9. అది తక్కువగా పనిచేయడాన్ని నిగ్రహించడం
10. అర్థరైటిస్ రాకుండా కీళ్లను బలంగా ఉంచడం
11. రక్త హీనత నివారించడం
12. రెండు రకాల రక్తపోట్లను దూరంగా ఉంచడమని రాగిపై అధ్యయనం నిపుణులు చెబుతున్నారు.