Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షాపుల్లో అమ్మే గోధుమ పిండితో రొట్టెలా.. వామ్మో వద్దే వద్దు..

గోధుమ రొట్టెలు తింటే ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాత్రి వేళల్లో గోధుమ రొట్టెలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. కానీ బియ్యంతో పోలిస్తే గోధుమలు జీర్ణమయ్యే విషయ

షాపుల్లో అమ్మే గోధుమ పిండితో రొట్టెలా.. వామ్మో వద్దే వద్దు..
, సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:35 IST)
గోధుమ రొట్టెలు తింటే ప్రయోజనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాత్రి వేళల్లో గోధుమ రొట్టెలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. కానీ బియ్యంతో పోలిస్తే గోధుమలు జీర్ణమయ్యే విషయంలో చాలా సమస్యలున్నాయని కొందరు వాదిస్తున్నారు. అయితే గోధుమ రొట్టెల్ని రాత్రిపూట తినడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
గోధుమల్లో ఉండే సెలియాక్ డిసీజ్, వీట్ అలెర్జీ, గ్లూటెన్ సెన్సిటివిటీ అజీర్తికి కారణమవుతాయని.. వీటివల్ల తలనొప్పి దగ్గర్నుంచీ విరేచనాల వరకూ నానారకాల సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. గోధుమ బంకగా ఉండటానికి గ్లుటెన్ కారణమవుతుంది.

ఇది మన పేగులకు అంటుకుని ఓ పట్టాన జీర్ణం కాదట. తరచూ ఇలా గ్లుటెన్తో మన పేగులకి పరీక్ష పెట్టడం వల్ల నిదానంగా వాటి శక్తి క్షీణించిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల జీర్ణశక్తి మందగించడమే కాకుండా, శరీరానికి అవసరమయ్యే పోషకాలను శోషించుకునే గుణాన్ని కూడా పేగులు కోల్పోతాయి. 
 
గోధుమ రొట్టెలను తినడం ద్వారా షుగర్ అదుపులో ఉంటుందని విశ్వాసం. కానీ ఇందులో కూడా వాస్తవం లేదట. గోధుమలు తిన్న వెంటనే వాటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరిపోతుందట. ముఖ్యంగా బ్రెడ్, రిఫైన్డ్ గోధుమలతో మనలోని చక్కెన నిల్వలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది.
 

ఆహారం తిన్న తరువాత అందులోని చక్కెర మన రక్తంలోకి చేరుకునే విధానాన్ని కొలిచేందుకు గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. ఇది బియ్యంతో పోలిస్తే గోధుమ పదార్థాలతో పెద్ద తేడాగా ఏమీ కనిపించదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదీ షాపుల్లో అమ్మే గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని.. పిండిని కూడా రిఫైన్డ్ చేయడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం తర్వాత వ్యాయామం చేయొచ్చా? వర్కవుట్‌కి ముందు స్నాక్స్ తీసుకుంటే?