చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, పాలు తాగుతుంటారు. ఐతే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.
అలా తీసుకుంటే వాటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యాసిడ్ ప్రభావానికి త్వరగా చనిపోతుంది. వాటివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అందుకే పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది.
ఎందుకంటే.. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల్లో వేర్వేరు మోతాదుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టిరియా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు పలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.