Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తులసి ఆకులు ఎక్కువగా తింటే ఏమవుతుంది?

Advertiesment
తులసి ఆకులు ఎక్కువగా తింటే ఏమవుతుంది?
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (18:51 IST)
తులసిలో యూజీనాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజీనాల్ కాలేయంలో టాక్సిన్-ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరేచనాలు, వేగవంతమైన హృదయ స్పందన, మూర్ఛలను కలిగించే అవకాశం వుంది. ఇకపోతే తులసితో కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు శోభి మచ్చలపై లేపనం చేస్తుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఆకలి కలుగుతుంది. 
 
ఒక గ్లాసు నీటిలో 20 తులసి ఆకులు, 20 పుదీనా ఆకులు, చిన్న అల్లం ముక్క, పావుస్పూన్ జీరకర్ర, వాము, ధనియాల చూర్ణం కలిపి సగం గ్లాసు కషాయం మిగిలేలా మరిగించి గోరు వెచ్చగా అయిన తర్వాత వడబోసి, సగం నిమ్మబద్ద రసం, ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు ఒకసారి తాగుతుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. జీర్ణాశయదోషాలు తొలగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పైత్య వికారాలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
 
వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగుతుంటే మలేరియా వ్యాధి సోకకుండా రక్షణ కలుగుతుంది. తులసి రసాన్ని ఒంటికి పట్టించుకుంటే దోమలు దరిచేరవు. రోజుకు ఒకసారి నాలుగైదు స్పూన్ల తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే క్రమంగా మూత్రపిండ, మూత్రకోశ, మూత్రశయాలలోని రాళ్లు కరిగిపోతాయి.
 
నీడలో ఎండించి, వస్త్రగాళితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని అరస్పూన్ వంతున ఉదయం, సాయంత్రం తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కుపొడుంలా పీలుస్తుంటే జలుబు, ముక్కు దిబ్బడ, తమ్ములు శిరోభారం, సైనసైటిస్ తదితర వ్యాధులు తగ్గుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణకు నాట్స్ అభినందనలు