కోలాలు గ్లాసులు గ్లాసులు తాగేస్తున్నారా? స్పెర్మ్ కౌంట్ 30 శాతం తగ్గిపోతుందట!
ప్పుడైనా ఓసారి పర్లేదు కానీ.. రోజూ సోడా లేదా కోలా తాగితే మాత్రం మగతనంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశోధకులు వెల్లడించారు. ఎప్పుడో ఓసారి పర్లేదు కానీ.. అదే పనిగా పీపాలు, పీపాలు తాగితే విపరీత పరిణామాలు
Publish Date: Thu, 07 Jul 2016 (08:17 IST)
Updated Date: Thu, 07 Jul 2016 (08:19 IST)
రోజూ మద్యానికి అలవాటు పడ్డారా? మందుతో కోలా తాగేస్తున్నారా? బిర్యానీ తిని కోలాలు గ్లాసులు గ్లాసులు తాగేస్తున్నారా? అయితే మీ మగతనం మటాష్ అంటూ తాజా అధ్యయనంలో తేల్చారు. డెన్మార్క్‌లోని కొపెన్‌హాగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన తాజా పరిశోధనలో రోజూ కోలా తాగే వారిలో మగతనం తగ్గిపోతున్నట్లు తేలింది.
ఎప్పుడైనా ఓసారి పర్లేదు కానీ.. రోజూ సోడా లేదా కోలా తాగితే మాత్రం మగతనంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశోధకులు వెల్లడించారు. ఎప్పుడో ఓసారి పర్లేదు కానీ.. అదే పనిగా పీపాలు, పీపాలు తాగితే విపరీత పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
2,554 మంది యువకులపై జరిపిన పరిశోధనలో రోజుకు లీటర్ కోలా తాగితే స్పెర్మ్ కౌంట్ 30 శాతం తగ్గిపోతోందని తేల్చారు. అంగస్థంభనలో కూడా సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు. కూల్‌డ్రింక్‌లలో వాడే తీపి పదార్ధాలతో పురుషాంగ ధమనులు దెబ్బతింటాయని పరిశోధనలో తేలిందని చెప్పారు.
మగతనం దెబ్బతినడంతో పాటు మానసిక, శారీరక ఇబ్బందులు కూడా ఏర్పడతాయని, లావైపోవడానికి కూడా ఇదే కారణమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.
Selvi
Publish Date: Thu, 07 Jul 2016 (08:17 IST)
Updated Date: Thu, 07 Jul 2016 (08:19 IST)