శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం.
బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.
తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి.
పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం.
ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.