Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలను వేధించే రక్త హీనత... బీట్‌రూట్ రసంతో చెక్

మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అని అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ

Advertiesment
మహిళలను వేధించే రక్త హీనత... బీట్‌రూట్ రసంతో చెక్
, గురువారం, 15 సెప్టెంబరు 2016 (11:04 IST)
మనదేశంలో రక్తహీనతతో బాధపడుతున్నవారు స్త్రీలు, పిల్లలు ఎంతో మంది ఉన్నారు. రక్త హీనతను ఎనీమియా అని అంటారు. దీని బారినపడ్డవారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు తగ్గిపోతాయి. రక్తహీనత తీవ్రతను బట్టి నిస్సత్తువ, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం, తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే 'రక్తహీనత నుంచి బయట పడాలంటే ఆహార నియమాలు పాటించడమే నిజమైన. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత. 
 
అంతేగాకుండా వారు తీసుకునే ఆహారంలో పోషక విలువలు తగ్గిపోవడం వల్ల, రుతుసమయంలో అధిక రక్తస్రావం వల్ల, ఫైల్స్ సమస్య వల్ల కూడా రక్తహీనత వస్తుంది. దీనివల్ల రక్తంలో ఎర్రకణాల సంఖ్య తగ్గిపోయి శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీని కారణంగా ఒంట్లో నీరసంగా ఉండటం, కళ్ళు తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తలనొప్పి తదితర సమస్యలు కలుగుతాయి.
 
మరి దీనికి పరిష్కారమే లేదా..? అంటే ఉందని చెప్పాలి. అదేంటంటే... మందులకన్నా... ప్రతిరోజూ వీరు తీసుకునే ఆహారంలో ఐరన్ అధికంగా లభించే వాటినే తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా కాయగూరలు, పండ్లలో ఉంటుంది.
 
తాజా కూరగాయలలో పాలకూర, క్యారట్, ముల్లంగి, బీట్‌రూట్, టమోటాలలోనూ... ఇక పండ్ల విషయానికొస్తే... అరటిపండు, యాపిల్, ద్రాక్ష, ఆప్రికాట్‌లలోనూ ఐరన్ అధికంగా లభిస్తుంది. అరటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్, బి12 విటమిన్‌లు రక్తహీనత నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
అంతేగాకుండా బీట్‌రూట్ రసాన్ని తీసుకున్నట్లయితే... రక్తహీనత సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. బీట్‌రూట్ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచటమే గాకుండా... శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి చాలామంది ఎదుర్కుంటున్న ఈ రక్తహీనత సమస్యను అధిగమించేందుకు పై సూచనలను తప్పకుండా పాటిస్తారు కదూ...! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తపోటును నివారించే పొటాషియం.. బంగాళాదుంపలో పుష్కలం...