నాటుకోడి పులుసు బెస్టా... చికెన్ 65 బెస్టా.. తెలుసుకోండి మరి..!?
నాటుకోళ్ళు Vs బ్రాయిలర్ కోళ్ళు.. అంటేనే నాటు కోళ్ళే బెస్ట్ అనేస్తారు. గ్రామాల్లో ఇంట్లో పెంచే కోళ్ళను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ప్రోటీనులు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తారు. అయితే ప్రస్తుతం బ్రాయి
నాటుకోళ్ళు Vs బ్రాయిలర్ కోళ్ళు.. అంటేనే నాటు కోళ్ళే బెస్ట్ అనేస్తారు. గ్రామాల్లో ఇంట్లో పెంచే కోళ్ళను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ప్రోటీనులు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తారు. అయితే ప్రస్తుతం బ్రాయిలర్ కోళ్ళ వాడకం ఎక్కువైంది. అయితే వీటిలో ప్రోటీనుల ఎంతమేరకున్నాయనే విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం బ్రాయిలర్ కోడిలో ఉన్న ప్రోటీనుల కంటే రసాయనాలే ఎక్కువని పరిశోధనల్లో తేలింది. యాంటీ బయోటిక్‌లను కలిపి కోళ్ళకు ఇవ్వడం.. వాటి పెరుగుదలకు ఉపయోగపడతాయో ఏమో కానీ.. వాటిని తినే వారికి మాత్రం వ్యాధుల్నే కొనితెచ్చిపెడతాయి.
బ్రాయిలర్ కోళ్లను తినడమే ఆరోగ్యానికి హాని చేస్తుంటే.. వాటి తయారీల్లోనూ రసాయనాలు వాడటం ద్వారా మరిన్ని అనారోగ్య సమస్యలు తప్పట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా చికెన్ 65ల్లో ఉపయోగించే ఎరుపు రంగుతో కూడిన పౌడర్ ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ పౌడర్లలో రంగు కోసం ఎరిథ్రోసిన్ అనే ఇతరత్రా రసాయనాలు కలవడం ద్వారా ఆరోగ్యానికి చేటు తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఇండికో కార్బైన్ అనే రసాయాన్ని ఐస్ క్రీమ్, మిల్క్ బిస్కేట్, స్వీట్స్, టిన్నుల్లో వచ్చే బఠాణీల్లో కలపడంతో పాటు.. టిన్నుల్లో వచ్చే కూల్ డ్రింక్స్‌ల్లో కలుపుతున్నారు. ఇవి కూడా క్యాన్సర్ కారణాలవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈ కలర్లను ఆహారంలో కలపకపోవడం మంచిది.
ఒకవేళ కలిపితే మోతాదు తక్కువగా ఉండాలి. ఇంకా హోటళ్లలో చికెన్‌కు రంగు వచ్చేందుకు ఉపయోగించే కలర్‌లో వేడి డై, మెటానిల్ వంటి కెమికల్స్ చేర్చుతున్నారు. వీటి ద్వారా గొంతు నొప్పులు వస్తాయి. హార్మోన్ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. డై చేర్చడం ద్వారా కిడ్నీ, కాలేయ, క్యాన్సర్ కారకాలతో ఇబ్బందులు తప్పవంటున్నారు. సో బ్రాయిలర్ చికెన్‌తో పాటు వాటికి ఉపయోగించే మసాలాల్లో కూడా రసాయనాలున్నాయి. అందుచేత నాటుకోడి పులుసే బెస్ట్.. బ్రాయిలర్ చికెన్ 65లు వద్దే వద్దు.!