చూసేందుకు చిన్నసైజు పనసకాయలో వుంటుంది బ్రెడ్ ఫ్రూట్. ఈ పండును కూర పనస అని కూడా పిలుస్తుంటారు. ఈ పండును తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
బ్రెడ్ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.
ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బ్రెడ్ ఫ్రూట్ శరీరానికి శక్తిని ఇస్తుంది.
ఈ పండులో ఒమేగా, కొవ్వు ఆమ్లాలున్న కారణంగా చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది.
బ్రెడ్ ఫ్రూట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఊబకాయంతో బాధపడేవారికి బ్రెడ్ ఫ్రూట్ మంచి ఎంపిక.
బ్రెడ్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో బ్రెడ్ ఫ్రూట్ దోహదపడుతుంది.