పరీక్షలు వచ్చేసాయి. ఈ సమయంలో విద్యార్థులు చదివినవి చదివినట్లు గుర్తు వుండటం చాలాముఖ్యం. జ్ఞాపకశక్తికి దోహదపడే పదార్థాలను తీసుకుంటే మంచిది. కనుక అలాంటి పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
ఫ్యాటీ ఫిష్
సాల్మన్, టూనా వంటి చేపలులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి, ఇవి తింటే బ్రెయిన్ సెల్స్ వృద్ధి చెంది జ్ఞాపకశక్తి పెంపొందుతుంది.
పసుపు
పసుపులో వున్న కర్కుమిన్ మేధాశక్తికి తోడ్పడుతుంది.
బెర్రీ పండ్లు
మెదడుకు కావలసిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
గింజ ధాన్యాలు
వాల్ నట్స్, బాదములు వంటి వాటిలో జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ప్రోటీన్లు, కొవ్వులు వున్నాయి.
బ్రొకోలి
బీటీ కెరొటిన్, ఫోలేట్, విటమిన్ కె వున్నటువంటి బ్రొకోలి తింటుంటే బ్రెయిన్ ఫంక్షన్ శక్తి పెరిగి జ్ఞాపకశక్తి మెండుగా వుంటుంది.