Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గరం మసాలా టీతో గొంతు గరగర మటాష్.. బరువు తగ్గించే టీ...

గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది. లవంగం, శొంఠి, ఏలకులు, దాల్చిన చెక్కను పౌడర్‌లా చేసి టీ అరస్పూన్ వేసుకుంటే జలుబు తగ్గడంత

Advertiesment
Weight loss tea
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:30 IST)
గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది. లవంగం, శొంఠి, ఏలకులు, దాల్చిన చెక్కను పౌడర్‌లా చేసి టీ అరస్పూన్ వేసుకుంటే జలుబు తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. దాల్చిన చెక్కలో బరువు తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. 
 
టీ త్రాగడం వల్ల ఆ ఆకులో వున్న పోషక విలువలు శరీరానికి లభ్యమవుతాయి. తేయాకులో కార్బోహైడ్రేట్‌, ఖనిజాలు లభిస్తాయి. విటమిన్‌ ఎ,బి,సి,ఇ,కె కూడా ఉంటాయి. కాపర్‌, ఐరన్‌,జింక్‌, మాంగనీస్‌ టీలో లభిస్తాయి. అందుచేత రోజుకు 2, 3 కప్పుల టీని త్రాగితే శరీరానికి ఎలాంటి హాని జరగదు.
 
* మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది.బ్లాక్‌ టీ రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.
* మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది. 
* మెదడును ఉత్తేజపరుస్తుంది.
* టీ త్రాగడంవల్ల క్యాన్సర్‌ వ్యాధి ఏర్పడే అవకాశం తక్కువ. బద్ధకం ఉండదు. గుండెపోటును తగ్గిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూత్రపిండాల్లో రాళ్లు కరగాలంటే రోజుకో ఖర్జూరం పండు తినండి...