అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తే...? ఏమవుతుందంటే...?
అశ్లీల చిత్రాలని అదే పనిగా కళ్లార్పకుండా చూస్తే కనుగుడ్డుకు రక్తప్రసరణ తగ్గి కనుచూపు మందగిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బూతు చిత్రాలను ఎడతెరపి లేకుండా చూస్తే.. గుడ్డితనానికి దారి తీస్తుం
అశ్లీల చిత్రాలని అదే పనిగా కళ్లార్పకుండా చూస్తే కనుగుడ్డుకు రక్తప్రసరణ తగ్గి కనుచూపు మందగిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. బూతు చిత్రాలను ఎడతెరపి లేకుండా చూస్తే.. గుడ్డితనానికి దారి తీస్తుందని నెదర్లాండ్స్ గ్రోనిజెన్ మెడికల్ సెంటర్ యూనివర్శిటీలోని యూరో న్యూరాలజిస్టు డా.గెర్ట్ హోల్ హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య మగవారికంటే ఆడవారిలోనే అధికంగా ఉంటుందట. మహిళల కనుచూపు త్వరగా మందగిస్తుందట. దానికి కారణం బూతు సినిమా చూస్తున్నపుడు మహిళ కళ్ళలో సెక్స్ కోరికలు రాకముందే పూర్తి ఆందోళనకు గురికావడమే దీనికి ముఖ్య కారణమని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణులు జరిపిన పరిశోధనలో భాగంగా 12 మందికి వరుసగా అశ్లీల చిత్రాలను చూపించారు. వారి మెదళ్లను పీఈటీ అంటే పొసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫిలతో స్కానింగ్ చేశారు. మహిళ కనుగుడ్డుకు రక్తప్రసరణ గణనీయంగా తగ్గిపోవటాన్ని గమనించారు. అంతేకాకుండా అధిక స్థాయిలో అశ్లీల చిత్రాలను చూసేటప్పుడు మరింత అధికంగా రక్తప్రసరణ తగ్గడం కూడా గమనించారట. ఇదే రీతిలో అశ్లీల చిత్రాలు చూడటం జరిగితే అతి త్వరలోనే కంటిచూపు సమస్యలు, కంటి చూపును కోల్పోవడం వంటి సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.