Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైవాహిక లేదా డేటింగ్ డీల్ బ్రేక్‌కు యువతులే కారణమా..?

Advertiesment
university of western sydney
, శుక్రవారం, 23 అక్టోబరు 2015 (14:35 IST)
వైవాహిక లేదా డేటింగ్ డీల్ బ్రేక్ అయ్యేందుకు యువతులే కారణమని తాజా అధ్యయనంలో తేలింది. పురుషుల్లో ఎక్కువమంది ఎవరో ఒక అమ్మాయి దొరికితే చాలని భావిస్తుంటే.. మహిళలు మాత్రం ఎన్నో అంశాల్ని పరిశీలించిన తర్వాతే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ సిడ్నీ ప్రొఫెసర్ పీటర్ కే జాన్సన్ నేతృత్వంలోని బృందం అధ్యయనంలో తేలింది.

ఈ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను పర్సనాలిటీ అండ్ సైకాలజీ పత్రిక ప్రచురించింది. రోజుకు రోజుకూ మారుతున్న జీవన పరిస్థితులు యువతీ యువకుల మధ్య బంధాన్ని తెగతెంపులు చేసేందుకు కారణమవుతున్నాయని అధ్యయనకారులు తేల్చారు. 
 
5000 మందికిపైగా జరిగిన పరిశోధనలో 21-76 సంవత్సరాల వయస్కులు పాల్గొన్నారు. వైవాహిక లేదా డేటింగ్ డీల్ బ్రేక్‌కు కారణాలు ఏవంటే.. సోమరితనం, మరొకరితో సంబంధాన్ని పెట్టుకోవడం, లైంగిక ఆనందం ఇవ్వలేకపోవడం, అతిగా మాట్లాడటం, పెళ్లికి ముందు గల సంబంధాలు, పిల్లలున్నా దాచేయడం వంటివని తేలింది. ఇంకా మద్యం సేవించడం, ఆకర్షణీయ శరీరాకృతి లేకపోవడంతో పాటు గంటల పాటు భాగస్వామిని వీడి దూరంగా ఉండటం వంటి కారణాలతోనే జంటలు విడిపోతున్నాయి. 
 
అంతేగాకుండా.. సెల్ ఫోన్లు, టీవీలకు అంకితమైపోవడం.. సామాజిక వెబ్ సైట్లపై మోజు వంటివి కూడా వైవాహిక సంబంధాలను తెగతెంపులు చేసుకునేందుకు కారణమవుతున్నాయి. ఇకపోతే.. భాగస్వామి ఎంపికలో తప్పు చేశామని భావిస్తున్న వారిలో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్యే అధికంగా ఉంది.

భాగస్వాముల గురించి అర్థం చేసుకోకుండా ముందడుగు వేయడం ద్వారా ఆత్మహత్యలు, అనారోగ్యాలు, అబార్షన్లు వంటివి తప్పట్లేదని ఓ డేటింగ్ డీల్ రద్దు చేసుకోవాలన్నా ఆలోచన ముందుగా యువతుల్లోనే కలుగుతోందని, సరైన సమాచారం లేకుండా తప్పటడుగు వేశామని భావించడమే ఇందుకు కారణమని అధ్యయనకారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu