Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టైప్ చేస్తుంటే చేతి వేళ్లు ఎక్కువగా నొప్పి పుడుతున్నాయి.. ఎందుకని?

టైప్ చేస్తుంటే చేతి వేళ్లు ఎక్కువగా నొప్పి పుడుతున్నాయి.. ఎందుకని?
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (18:42 IST)
చాలా మంది గంటల కొద్దీ టైపింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారికి చేతి వేళ్లు నొప్పి పుడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రాత్రివేళల్లో చేతిలో సూదులు గుచ్చుతున్నంత బాధ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చేతులు బలహీనమైనట్లుగా కూడా అనిపిస్తోంది. ఇలాంటి సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది? 
 
సాధారణంగా మన చేతులకు సంబంధించిన నరాలు మణికట్టు దగ్గర ఒక సన్నటి ద్వారం గుండా అరచేతుల్లోకి వెళ్తుంటాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మణికట్టులోని ఎముకలు అరుగుదలకు గురవుతుంటాయి. దాంతో మణికట్టు గుండె వెళ్లే నరాలకు మార్గం మరింత సన్నబడుతుంది. దాంతోపాటు టైపింగ్ సమయంలో మన మణికట్టును కాస్త ఒంచి టైప్ చేస్తుంటాం. దానివల్ల నరాల ప్రవేశద్వారం మరింత సన్నబడుతుంది. ఫలితంగా నరాలపై ఒత్తిడి పడి అరచేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్న బాధ కలుగుతాయి. ఇలాంటి వారు నరాల పరిస్థితికి అనుగుణంగా పరీక్షలు చేయించి, వ్యాధిని దాని తీవ్రతను తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స చేసుకున్నట్టయితే, సమస్యకు అదే పరిష్కారమార్గమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu