Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధిక కేలరీలున్న పదార్థాలతోనే థైరాయిడ్ సమస్య.. పొటాటో వద్దే వద్దు..!

మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

అధిక కేలరీలున్న పదార్థాలతోనే థైరాయిడ్ సమస్య.. పొటాటో వద్దే వద్దు..!
, సోమవారం, 15 ఆగస్టు 2016 (15:47 IST)
మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు తప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యలను సకాలంలో గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
 
యోగా, ప్రాణాయామం వంటివి ధైరాయిడ్ పనితీరును క్రమబద్దికరిస్తుంది. అందువలన క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. విటమిన్ ఎ ధైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. రోజూ వారీ ఆహారంలో ఆకుకూరలు, గుమ్మడి వంటి వాటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
 
అధిక క్యాలరీలు కలిగిన పదార్థాలకు దూరంగా ఉంచడం మంచిది. బంగాళదుంపలను ఆహారంలో చేర్చుకోకపోవడం మంచిది. అయోడిన్, మాగ్నిషియం ఎక్కువగా ఉండే నట్స్‌ను తరచుగా తీసుకుంటే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఆహారంలో బియ్యానికి బదులుగా గోధుమలను తీసుకోవటం వలన ధైరాయిడ్  పనితీరు క్రమబద్దీకరణ చేయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి 8 గంటలకు నిద్రపోయే పిల్లలు.. ఉదయం 6 గంటలకు లేచే పిల్లలకు తేడా ఏంటి?