ఈరోజుల్లో ఆట్టే బరువు పెరిగిపోతుండటం జరుగుతోంది. కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువవడంతో స్థూలకాయం వచ్చేస్తుంది. ఈ స్థూలకాయంతో అనేక అనారోగ్యాలు దరిచేరుతున్నాయి. కనుక శరీర బరువును నియంత్రణలో వుంచుకోవాలి. ఒకవేళ బరువు పెరిగినా కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
ప్రత్యేకించి కొన్ని పానీయాలను తాగుతుంటే అధిక బరువు సమస్యను వదిలించుకోవచ్చు.
ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే శరీర అదనపు బరువు తగ్గించుకోవచ్చు.
జీరా వాటర్ తాగుతుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడమే కాకుండా షుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో వుంటాయి.
మెంతుల నీరు తాగుతుంటే స్థూలకాయం వదిలించుకోవచ్చు.
నిమ్మ నీటిలో కాస్తం తేనె వేసుకుని తాగుతుంటే బెల్లీఫ్యాట్ కరిగిపోతుంది.
సోంపును తింటున్నా కూడా అధిక బరువు సమస్యను అదుపుచేయవచ్చు.
గోరువెచ్చని మంచినీటిలో సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన చెక్కను వేసుకున్నా ఫలితం వుంటుంది.