Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటిచూపు మెరుగవ్వాలంటే.. టమోటాల్ని ఆహారంలో చేర్చుకోండి.

Advertiesment
Tomato
, సోమవారం, 12 అక్టోబరు 2015 (18:24 IST)
విటమిన్ సి పుష్కలంగా దాగివున్న టమోటాను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. టమోటాలో విటమిన్ సి మాత్రమే గాకుండా మేగ్నీషియం, ఫాస్పరస్, కాపర్‌లు కూడా ఉన్నాయి. కూరల్లో మాత్రమే గాకుండా టమోటాలను సలాడ్స్, శాండ్‌విచ్, కూరగాయలతో కలిపి తీసుకోవచ్చును. 
 
టమోటాలో దాగివున్న ఆరోగ్య సూత్రాలను పరిశీలిస్తే.. 
* టమోటా చెడు కొలెస్ట్రాల్‌, గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టవచ్చును
* టమోటాలు తీసుకుంటే నిత్యయవ్వనులుగా ఉంటారు. చర్మాన్ని, కేశానికి సంరక్షించే యాంటీయాక్సిడెంట్లు టమోటాల్లో పుష్కలంగా వున్నాయి. 
 
* టమోటాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది. 
* విటమిన్ కె, క్యాల్షియంలు కలిగిన టమోటాలను తీసుకుంటే ఎముకలు ఆరోగ్యమవుతాయి. 
* విటమిన్ ఎ, సిలు వుండే టమోటాలను యాంటీయాక్సిడెంట్ల ద్వారా డీఎన్‌ను డామేజ్ చేయకుండా కాపాడుతుంది. 
 
* టమోటా అనేక క్యాన్సర్ వ్యాధులు అనగా ప్రోస్టేట్, ఉదర, నోటి వంటి ఇతరత్రా క్యాన్సర్లను నియంత్రిస్తుంది. 
* టమోటా శరీరంలోని చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu